Pushpa Movie : సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమా పోస్టర్లు సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచటం తెలిసిందే. భయంకరమైన ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ గడ్డం జుట్టు కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో సినిమా స్టోరీ కూడా “రంగస్థలం” తరహా పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లర్ తరహాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఉంటున్నట్టు వార్త రావడంతో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
పైగా సినిమా లో లారీ డ్రైవర్ పాత్రలో కూడా బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ విధంగా ఎన్నో వెరైటీ లతో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రమములో పైగా ఫస్ట్ టైం పాన్ ఇండియా తరహాలో సినిమా రాబోతున్న నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాక సినీ ప్రేమికులు “పుష్ప” సినిమా కోసం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరొక స్టార్ హీరో నటించడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళితే అప్పట్లో “వేదం” సినిమాలో అల్లు అర్జున్ తో నటించిన మంచు మనోజ్ మరోసారి బన్నీ తో “పుష్ప” సినిమాలో నటించడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో సరికొత్త టాక్ నడుస్తోంది.
ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాలో ఉండగా మరొక క్యారెక్టర్ కోసం మంచు మనోజ్ ని తీసుకోవడానికి స్ట్రాంగ్ గా సుకుమార్ డిసైడ్ అవటంతో “పుష్ప” సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సుకుమార్.. మంచు మనోజ్ కి చెయ్యబోయే క్యారెక్టర్ వినిపించినట్లు, ఓకే అయినట్లు త్వరలోనే..అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిలిం నగర్ టాక్.