సినిమా

Rajamouli Mahesh: రాజమౌళి- మహేష్ మూవీలో సచిన్ కూతురు..??

Share

Rajamouli Mahesh: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఎదురుచూస్తున్నారు. “బాహుబలి 2”, “RRR” తో… తన డైరెక్షన్ ఏంటో ఇండియా కి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరిగింది. “బాహుబలి 2”, “RRR” తో రాజమౌళి అనేక రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని చెప్పటం మాత్రమే కాదు ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ మీద జక్కన్న పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. మహేష్ తో చేస్తున్న సినిమా “బాహుబలి 2”, “RRR” కంటే హై బడ్జెట్ సినిమా అని కూడా జక్కన్న తెలిపారు. in Rajamouli Mahesh movie Sachin's daughter heroine

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా లో మహేష్ సరసన హీరోయిన్ గా సచిన్ కూతురు సారా నీ తీసుకోవడానికి రాజమౌళి డిసైడ్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో సచిన్ కూతురిని తన సినిమాల్లో హీరోయిన్ గా తీసుకుంటే మరింత క్రేజ్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతుందన్న భావనతో రాజమౌళి.. మహేష్ మూవీలో సచిన్ కూతుర్ని తీసుకునే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సచిన్ కూతురు సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. in Rajamouli Mahesh movie Sachin's daughter heroine

 

ఆల్ రేడీ మోడలింగ్ రంగంలో పాటు.. కొన్ని ప్రముఖ యాడ్ కంపెనీలకు అంబాసిడర్ గా ఉన్న సారా… సినిమాల్లోకి రావటానికి ఇప్పటికే నటన శిక్షణ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సచిన్ కూతురు తన ఫస్ట్ మూవీ ఇండియన్ గ్రేట్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు వచ్చిన వార్త సంచలనంగా మారింది. ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” కంప్లీట్ చేయడం తెలిసిందే. జూన్ నెల నుండి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత దసరా నుండి రాజమౌళి సినిమా సెట్స్ మీదకు తీసుకెల్లే ఆలోచనలో.. సినిమా యూనిట్ వున్నట్లు సమాచారం.


Share

Related posts

Anasuya: అది ఉంటేనే సినిమా సెలెక్ట్ చేస్తానంటున్న అనసూయ..!!

sekhar

Trivikram : యాడ్స్ రంగంలో సత్తా చాటుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్..!!

sekhar

Hebah Patel Cute Looks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar