Subscribe for notification

RRR: “ఆర్ఆర్ఆర్” లో ఆర్జీవికి ఇష్టమైన సీన్ ఏంటో తెలుసా..??

Share

RRR: “ఆర్ఆర్ఆర్” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన మూవీ. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమా మేకింగ్ కి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు దర్శకుడు జక్కన్నకి సెల్యూట్ చేశారు. పాండమిక్ తర్వాత ఊహించని రీతిలో విడుదలయ్యి… అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని… పెద్ద సినిమాల వ్యాపారం విషయం డోకా లేదని నిరూపించింది. అటువంటి ఈ సినిమా గురించి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఇతర సినిమాల గురించి పెద్దగా ఆర్జివి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే అది కాంట్రవర్సీ కామెంట్స్ తరహాలో వ్యాఖ్యానిస్తారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో యాంకర్ ఆర్జివి ఒక ప్రశ్న వేయడం జరిగింది. పుష్ప, కేజిఎఫ్, “RRR” మూడు సినిమాలలో ఏది ఇష్టం అని ప్రశ్నిస్తే దానికి మీ సమాధానం వెంటనే ఆర్జీవి “RRR” అని టక్కున చెప్పారు. అయితే “RRR”లో… మీకు నచ్చిన సీన్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది.

దానికి రాంగోపాల్ వర్మ … తారక్ భుజంపైన చెర్రీ కూర్చుని జరిగే ఫైట్ సీన్ ఇష్టమైన సన్నివేశం అని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. ఇప్పటివరకు ఆ రీతిగా ఎవరు చిత్రీకరించ లేదని, ఆ ఫైట్ సీన్ తెరకెక్కించడం చాలా కష్టతరం అన్న తరహాలో ఆర్జీవి చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మీరు మల్టీస్టారర్ సినిమాలు చేసే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా అటువంటి సినిమాలు నా నుండి ఆశించ వద్దని తెలిపారు. హీరో క్రేజ్ ఆధారం చేసుకుని  స్టోరీలు రాయటం నా వల్ల కాదు అని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.


Share
sekhar

Recent Posts

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

25 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

58 mins ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

1 hour ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago

Pakka Commercial: `పక్కా కమర్షియల్` క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే గోపీచంద్ న‌యా రికార్డ్‌!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago