Ram Charantej: తెలుగు సినిమా రంగంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుసపెట్టి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” తో… భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. ఎన్టీఆర్ తో చరణ్ ఫస్ట్ టైం నటించిన ఈ సినిమా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నటనా పరంగా డాన్స్ పరంగా ఇద్దరు హీరోలు న్యాయం చేయటంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం తో.. విడుదలైన ప్రతి చోట రికార్డ్ కలెక్షన్ “ఆర్ఆర్ఆర్” రాబడుతోంది. “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ చరణ్ తేజ్… ప్రస్తుతం శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ తేజ్ కెరీర్ లోనే అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఇది. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నట్లు వార్తలు రావడం మాత్రమే కాదు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడం మనం చూశాం. శంకర్ దర్శకత్వంలో అప్పట్లో అర్జున్ నటించిన “ఒకే ఒక్కడు” సినిమా తరహాలో.. ఈ సినిమా ఉంటుందని సీఎం పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు.. ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్.. పంజాబ్ రాష్ట్రంలో అమృత్ సర్ లో జరిగిందట.
హీరో చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారట. అయితే సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం… టీనేజ్ కుర్రాడి పాత్రలో చరణ్.. నటించడం జరిగిందట. ఇది సినిమా మొత్తానికి హైలెట్ గా ఉండే రీతిలో చరణ్ నీ.. శంకర్ ప్రజెంట్ చేసినట్లు సమాచారం. కాలేజీ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు… తాజా షెడ్యూల్ లో షూట్ చేయడం జరిగిందట. దాదాపు మూడు డిఫరెంట్ పాత్రలో చరణ్ నీ… శంకర్ చూపించినట్లు అన్నిటికంటే ఈ టీనేజ్ కుర్రాడి పాత్ర.. సినిమా మొత్తానికి హైలెట్ అని.. ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ నేపథ్యంలో.. తెరకెక్కనుంది.