NewsOrbit
సినిమా

Arjun: అదిరిపోయే ప్లాన్ తో కూతుర్ని టాలీవుడ్ లో దింపుతున్న యాక్షన్ కింగ్ అర్జున్..??

Share

Arjun: దక్షిణాది సినిమా రంగంలో దాదాపు అన్ని భాషలలో నటించిన హీరో యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగు ప్రేక్షకులకు కూడా అర్జున్ సుపరిచితుడే. తెలుగులో అప్పట్లో అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉండేది. దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన అర్జున్ తెలుగులో కూడా ఎప్పటినుండో సినిమాలు చేస్తూ రావడం జరిగింది. జగపతి బాబు తో నటించిన హనుమాన్ జంక్షన్.. శంకర్ దర్శకత్వంలో నటించిన ఒకే ఒక్కడు, జెంటిల్ మాన్, సినిమాలు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హీరోగా అదేవిధంగా విలన్ పాత్రలో కూడా అర్జున్ నటించడం జరిగింది.

in telugu arjun introduces her daughter with vishwek sen

ఇదిలా ఉంటే అర్జున్ తన కూతురు ఐశ్వర్య నీ ఇప్పటికే తమిళం కన్నడం లో నటింపజేయడం జరిగింది. హీరోయిన్ గా ఐశ్వర్య.. తమిళం అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో కూతురు ఐశ్వర్య నీ సరికొత్త ప్లానింగ్ తో రంగంలోకి అర్జున్ దింపుతున్నాడు. ప్రతి విషయంలోకి వెళ్తే సొంత బ్యానర్ లో.. తన డైరెక్షన్ లోనే కూతురు ఐశ్వర్య నీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి అర్జున్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఈ క్రమంలో స్టోరీ ఆల్రెడీ రెడీ చేసినట్లు.. హీరో విశ్వక్ సేన్ నీ తీసుకోవడానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో కుర్ర హీరోలలో విశ్వక్ సేన్ మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. దీంతో ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అర్జున్… తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేసే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

రామ్ తీసుకున్న షాకింగ్ డెసిషన్ తో వాళ్ళంతా నెత్తి నోరు బాదుకుంటున్నారట .. ?

GRK

Anasuya : అనసూయ కోసం టాలీవుడ్ లో కొత్త కథలు తయారు చేస్తున్న దర్శకులు ..?

GRK

Samantha: శాకుంతలం ట్రైలర్ చూసి నాగచైతన్య ఒకేఒక్క మాట అన్నాడు..!?

bharani jella