JGM: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్ లలో ఒకరు పూరి జగన్నాథ్. ఎన్ని ఫ్లాపులు పడినా గాని తిరిగి హిట్ అందుకోవడంలో పూరి పడి లేచే కెరటం అని చెప్పవచ్చు. ఈ క్రమంలో గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి.. ఆఖరికి ఇండస్ట్రీ నుండి కూడా దుకాణం సర్దుకునే పరిస్థితి అని అందరూ అనుకున్న సమయంలో 2019వ సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్ ” తో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్, JGM సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండిటిలో “లైగర్” షూటింగ్ ఆల్రెడీ కంప్లైంట్ కావడం తెలిసిందే. ఆగస్టు 25 వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి పూరి జగన్నాథ్ అడుగుపెట్టనున్నారు.
ఆ తర్వాత ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ “JGM”ని అధికారికంగా ముంబైలో పూరి లాంచ్ చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళితే పూరీ జగన్నాథ్ కథ ఏ హీరో అయినా రిజెక్ట్ చేస్తే దాన్ని వేరే హీరోతో తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు “పోకిరి: స్టోరీ మొదట పవన్ కళ్యాణ్ కి.. వినిపించగా దాన్ని రిజెక్ట్ చేయడం తో మహేష్ తో తీసి .. ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఒక పోకిరి మాత్రమే కాదు ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి,.. మరికొన్ని సినిమా కథలు పవన్ కి వినిపించగా..ఆయన రిజెక్ట్ చేయడంతో…అవే కథలతో మరొక హీరోలను పెట్టి తీసి భారీ విజయాలు పూరి జగన్నాథ్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో JGM స్టొరీని మొదట మహేష్ కి పూరి వినిపించగా.. ఓకే చేసి ఆ తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తుండటంతో… గత సెంటిమెంటు పరంగా రెండో హీరోతో… తన డ్రీమ్ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్ చేస్తూండటంతో గ్యారెంటీగా “JGM” భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని పూరి ఫ్యాన్స్ చెప్పుకోస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జూన్ నెలాఖరు నుండి ఇండియాతో పాటు ఆఫ్రికాలో పూరి ప్లాన్ చేసినట్లు సమాచారం.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…