Charan: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి ఇమేజ్ తో సంబంధం లేకుండా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్ని విజయాలు వచ్చినా గానీ ఒదిగి ఉండే గుణం తో పాటు.. తన తోటి వాళ్లను కూడా పైకి తీసుకు వచ్చే రకం. ఒక పక్క సినిమా హీరోగా చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా చరణ్ రాణిస్తున్నాడు. ముఖ్యంగా రాజకీయాలనుండి సినిమాల్లోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక… కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి.. చరణ్ వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి రీ ఎంట్రీ మూడు సినిమాలు ఖైదీ నెంబర్ 150, సైరా… కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలకు చరణ్ నిర్మాతగా రాణిస్తున్నాడు. ఇదిలాఉంటే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” ఈ సినిమాతో చరణ్ భారీ విజయం అందుకోవడం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించిన గాని.. నటన పరంగా డాన్స్ పరంగా చరణ్.. తారక్ కి ఏ మాత్రం తీసుకోలేదు. “ఆర్ఆర్ఆర్” రాకముందు చాలావరకు సినిమాలో ఎన్టీఆర్ గ్యారెంటీగా చరణ్ నీ దామిని చేయడం జరుగుతుందని అనుకున్నారు.
కానీ సినిమా చూశాక సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు ఇద్దరు హీరోలు బాగా న్యాయం చేశారని కామెంట్ చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీ హిట్ దిశగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ జనరేషన్ ఉన్న హీరోలలో.. వారిదైన రికార్డు చరణ్ సొంతం చేసుకున్నాడని వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. అదేమిటంటే మూడు ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోగా చరణ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొదట “మగధీర”.. ఆ తర్వాత “రంగస్థలం” సినిమా తో నాన్ బాహుబలి.. రికార్డు. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” తో..మూడు ఇండస్ట్రీ రికార్డులు… చరణ్ తన పేరిట నమోదు చేసుకోవడం జరిగిందని చెబుతున్నారు. అయితే ఈ మూడింటిలో రెండు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు కావడం విశేషం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!