SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ నుండి రిలీజ్ అయిన రెండో సాంగ్ పెన్నీ … టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు ల మోత మోగిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం.. అభిమానులను సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంది. తమన్ గతానికి భిన్నంగా.. తన కొత్త టీం సభ్యులతో అందిస్తున్న బాణిలు … ఈ మధ్య భారీ ఎత్తున రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అఖండ, బీమ్లా నాయక్, సినిమాలకి అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గత సినిమాలకు ప్రజెంట్ సినిమాలకు చాలా తేడా చూపించడం జరిగింది.
ఇప్పుడు ఇదే తరహాలో మహేష్ “సర్కారు వారి పాట” కు తమన్ తనదైన శైలిలో మ్యూజిక్ అందించడం జరిగింది. దీంతో మొదటి సాంగ్ “కళావతి” యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. దాదాపు కొన్ని వారాలపాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఇంకా గా నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రెండో సాంగ్ “పెన్నీ” రిలీజ్ కావడం తెలిసిందే. అయితే ఈ సాంగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ సాధించడం మాత్రమే కాక ఎక్కువ మంది చూసిన సాంగ్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
ఫస్ట్ టైం మహేష్ కూతురు సితార తండ్రి సాంగ్ లో నటించడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కెమెరా ముందు మొదటి సారి అయినా గాని సితార.. ఏ మాత్రం భయం లేకుండా అదిరిపోయే స్టెప్పులేసింది. ఫుల్ ఎనర్జీతో మహేష్ బాబు కంటే బాగా పెన్నీ సాంగ్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కూతురు సితార ఇవ్వటం విశేషం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!