RRR: “బాహుబలి” లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తీసిన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో వస్తున్నా “ఆర్ఆర్ఆర్” పై దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 25 వ తారీకు రిలీజ్ అవుతున్న తరుణంలో ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో… సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఇద్దరు హీరోలు చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ఇద్దరు పెద్ద హీరోలు ఎన్టీఆర్, చరణ్ నటిస్తుండటం నందమూరి.. మెగా అభిమానులు ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలావుంటే ఇటీవల పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ లో స్క్రీన్ పైకి ఏకేసి భారీ ఎత్తున డ్యాన్సులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్”, ప్రభాస్ నటించిన రాధేశ్యాం సినిమాల ప్రారంభంలో అభిమానుల.. అత్యుత్సాహంతో స్క్రీన్ పైకి ఏకేయడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితి విజయవాడలో “ఆర్ఆర్ఆర్” థియేటర్ లో రాకూడదని … సరికొత్త టెక్నిక్ అని పెట్టారు.
దేశంలో ఏ థియేటర్లో లేని రీతిలో విజయవాడలో “ఆర్ఆర్ఆర్” నిజమవుతున్న సినిమా హాల్లో స్క్రీన్ పైకి అభిమానులు రాకుండా స్క్రీన్ ముందు ఉండే ఫ్లోర్ పై మేకులు గుచ్చేశారు. కాళ్ళకి గుచ్చుకుపోయే రీతిలో … థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ ఐడియా ఇప్పుడు మిగతా థియేటర్ యాజమాన్యం కూడా పాటించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. స్క్రీన్ లపై వెళ్ళిపోయి కొంతమంది హారతి పట్టడం మరికొంతమంది పేపర్ లు జల్లడం వంటివి ఇటీవల పెద్ద హీరోల సినిమాలకు భారీ ఎత్తున జరుగుతుండటంతో…”ఆర్ఆర్ఆర్” సినిమా థియేటర్ యాజమాన్యలు జాగ్రత్త పడుతున్నాయి. ఇద్దరు హీరోలు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు కావటంతో.. థియేటర్ లో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా… ఇప్పటినుండే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.