32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Oscar 2023 Nominations from India: 2023 ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన భారతీయ సినిమాల లిస్ట్..!!

Share

Oscar 2023 Nominations from India: 2023 ఆస్కార్ అవార్డ్ లకి సంబంధించి ఇండియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం రాజమౌళి తీసిన “RRR”. ఈ సినిమా గురించి హాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇండియా నుండి మొదట ఆస్కార్ అవార్డులకి “లాస్ట్ ఫిల్మ్ చలో షో” ఎంపిక కావడం జరిగింది. ఈ క్రమంలో “RRR” టీం స్వతహాగా ఆస్కార్ కు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో ప్రకటించిన ఆస్కార్ షార్ట్ లిస్టులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ కావడం జరిగింది.

List of Indian Movies Nominated for Oscar 2023 Awards
Indian Movies Nominated for Oscar 2023
Indian Movies of Oscar 2023:

ఇండియా నుండి ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలు తొలుత రెండు మాత్రమే. “RRR”, “లాస్ట్ ఫిల్మ్ చలో షో”. వీటితోపాటు డాక్యుమెంటరీ ఫ్యూచర్ గా ఆల్ థాట్ బ్రిత్స్, డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరిలో “ఎలిఫెంట్ విస్పర్స్”… షార్ట్ లిస్ట్ అయ్యాయి. నామినేషన్ లకు ముందే ఇండియా నుండి నాలుగు సినిమాలు షార్ట్ లిస్ట్ అవడం ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత కాంతారా, ది కాశ్మీరీ ఫైల్స్, విక్రంత్ రోన.. ఆస్కార్ జాబితాలో రావడం జరిగాయి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన చిత్రాలకు సంబంధించి ఫైనలిస్ట్ ఈరోజు సాయంత్రం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ ప్రకటించనుంది. ఇప్పటికే “నాటు నాటు సాంగ్” కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. దీంతో ఆస్కార్ పక్కాగా “RRR” కీ వస్తుందని సినీ ప్రేమికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. “RRR”కీ ఒక్క విభాగంలో ఆస్కార్ వచ్చిన తెలుగు సినిమా ప్రతిష్ట మరింత పెరగనుంది అని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.

List of Indian Movies Nominated for Oscar 2023 Awards
Oscar for RRR
RRR:

మరికొద్ది క్షణాల్లో ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ ల ఫైనల్ లిస్ట్ లో  “RRR” కీ చోటు దక్కుతుందో లేదో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు కూడా ఈ లిస్టులో ఉండే అవకాశాలు ఎక్కువ అని హాలీవుడ్ లో ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ మీద ఉన్నారు. “RRR”లో భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తోపాటు స్టార్టింగ్ పులితో ఫైట్.. కొమరం భీముడో సాంగ్ లో ఇచ్చిన హావభావాలు ఎన్టీఆర్ నటనకి హాలీవుడ్ ప్రేక్షకుల సైతం ముగ్దులయ్యారు. దీంతో అమెరికాలో ఉండే ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగ్ జైన్స్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు ప్రచూరం చేస్తూ ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ కచ్చితంగా ఫైనల్ నామినేషన్ లిస్ట్ లో ఉంటాడని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇక అంతకు ముందు ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ తర్వాత ఆ తరహా హోదా కలిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు “RRR” గెలవటంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలవడం జరిగింది. దీంతో కచ్చితంగా “RRR”..కీ ఆస్కార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డులకి సంబంధించి తుది నామినేషన్ లో “RRR” ఉంటుందో లేదో ఈరోజు సాయంత్రం తేలనుంది.

List of Indian Movies Nominated for Oscar 2023 Awards
Last Film Show
‘లాస్ట్ ఫిల్మ్ చలో షో’ :

భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ కీ మొదట నామినేట్ అయిన సినిమా “లాస్ట్ ఫిల్మ్ చలో షో”. ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయినా “RRR”నీ కాదని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్..”‘లాస్ట్ ఫిల్మ్ చలో షో’ ” ఎంపిక చేయటం అప్పట్లో పెద్ద వివాదాస్పదంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలో ఓ మారుమూల పల్లెటూరులో జరిగే కథతో “‘లాస్ట్ ఫిల్మ్ చలో షో’ ” తెరకెక్కించారు. గుజరాతి ప్రాంతీయ చిత్రమైన ఈ సినిమా స్టోరీ చూస్తే 9ఏళ్ళ వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథ. ఈ రీతిగా సినిమా థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్ తో 9వేల కుర్రాడు సమయ్ కి పరిచయం ఏర్పడింది. సమయ్ కి సినిమా అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా తెరపై బొమ్మగా కనబడాలన్నది తన యొక్క ధ్యేయం. దీంతో వేసవికాలం సమయంలో…. దాదాపు ప్రొజెక్షన్ రూమ్ లోనే సమయం గడపడం జరుగుద్ది. ఆ రీతిగా సినిమాపై మరింత ఇష్టం ఏర్పడి.. ఎలాగైనా.. వెండితెరపై కనిపించాలన్నది తన యొక్క ధ్యేయం. ఏ రీతిగా తన డ్రీమ్ సమయ్… ఎలా నెరవేర్చుకున్నాడు అన్నదే చలో షో యొక్క కథాంశం. డైరెక్టర్ పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్ధార్థ్ రాయ్ కపూర్, పాన్ నలిన్, ధీర్ మోమయా, మార్క్ డ్యూలే నిర్మించారు.

List of Indian Movies Nominated for Oscar 2023 Awards
The Elephant Whisperers
ది ఎలిఫెంట్ విస్పర్స్:

ఈ ఏడాది ఇండియా నుండి ఆస్కార్ బరిలో డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరిలో “ది ఎలిఫెంట్ విస్పర్స్” ఎంపిక కావటం తెలిసిందే. మొత్తం 40 నిమిషాల నిడివి కలిగిన సినిమా ఇది. కథ విషయానికొస్తే ఒక అడవిలో వయసు మీద పడిన భార్య భర్తలు ఉంటారు. ఈ ఇద్దరికీ తప్పిపోయిన ఏనుగు దొరుకుద్ది. ఆ ఏనుగుని తమ కుటుంబ సభ్యుడి మాదిరిగా ఈ ఇద్దరు వృద్ధులు ఎలా పెంచారు అన్నది స్టోరీ.  ప్రకృతికి మానవడితో ఉన్న బంధాన్ని ప్రధానంసంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఏనుగు..దానీ పిల్ల ఈ ఇద్దరు వృద్ధులతో కలిసి పోవడంతో.. ఆ ఏనుగుకి రఘు అనే పేరు కూడా పెట్టడం. ఏనుగు మరియు ఈ ఇద్దరు వృద్ధ భార్యాభర్తల మధ్య.. బంధం  అద్భుతంగా సినిమాలో చూపించడం జరుగుతుంది. ఈ రీతిగా జంతువులకి మానవులకు మధ్య బంధం అద్భుతంగా డాక్యుమెంటరీ రూపంలో చూపించడం జరుగుతుంది. సృష్టిలో ప్రకృతి జంతు మరియు మానవ బంధ బాండింగ్ నీ చాలా హైలెట్ గా చూపించిన ఈ  “ది ఎలిఫెంట్ విస్పర్స్” ఆస్కార్ అందుకుంటుందో లేదో చూడాలి.

List of Indian Movies Nominated for Oscar 2023 Awards
All That Breathes
ఆల్ దట్ బ్రీత్స్:

ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో “ఆల్ దట్ బ్రీత్స్” నిలవడం జరిగింది. ఢిల్లీలో ఉండే ఇద్దరు అన్నదమ్ములు గాయపడ్డ పక్షుల మీద రక్షించడమే లక్ష్యంగా ఈ సినిమాలో కనిపిస్తారు. ప్రాముఖ్యంగా గాయపడిన గెద్దలకు గాయాలు కడుతూ మహమ్మద్ సవుద్… నదిమ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఢిల్లీలో జీవనం సాగిస్తారు. పక్షులపై ప్రేమ ప్రతిభంభించే రీతిలో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించటం జరిగింది. డాక్యుమెంటరీ విభాగంలో గతంలో వరల్డ్ సినిమా గ్రాండ్ జూరి ప్రైస్, సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్, 2022 కాన్నేస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ ఐ అవార్డ్… దక్కించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆస్కార్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ క్యాటగిరిలో నిలిచింది. మరీ “ఆల్ దట్ బ్రీత్స్” కీ ఆస్కార్ వస్తుందో లేదో చూడాలి.


Share

Related posts

Sharwanand:`ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..ఇలాగైతే క‌ష్ట‌మే శ‌ర్వా!

kavya N

ఆఖరి నిమిషంలో డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న ప్రభాస్ హీరోయిన్..?

GRK

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు మాట ఇచ్చినా బండ్ల గణేష్..!!

sekhar