21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రివ్యూలు సినిమా

“కాంతార” లో ఏముంది..!? ఇండియన్ సినీ సెన్సేషన్: తెలుగు మరక !

Share

“కాంతర” సినిమా ఇప్పుడు భారతీయ సినీ తెర మీద సంలనం. కథ, కథనం పరంగా, నటన పరంగా ఇలా ఏ విధంగా చూసుకున్నా ఎంచ డానికి, విమర్శించడానికి పాయింట్ దొరకని సినిమా. సినీ విమర్శకుల మెప్పు కూడా పొందింది ఈ సినిమా. అసలు కాంతార సినిమాలో ఏముంది..? ఎందుకు ఇంతగా ఆదరణ పొందుతోంది..? ఇంత హిట్ టాక్ రావడానికి కారణాలు ఏమిటి..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే… కాంతార సినిమా ‘మనిషి దానం ఇచ్చిన తర్వాత అది తనదిగా ఫీల్ అవ్వకూడదు. దానం ఇచ్చిన తర్వాత దాన్ని తనది కాదు అని వదిలివేయాలి. అయితే నేను దానం ఇచ్చాను కదా అని నాదే అని ఎప్పుడైతే మనిషిలో ఆశ పుడుతుందో అది వినాశనానికి దారి తీస్తుంది’ అనే మూల కథా పాయింట్ తో ఈ సినిమా చిత్రీకరించారు. ఒక అధ్బుతమైన భూమి మీద ఆశ. తనది అనే స్వార్థం. అలాగే అటవీ ప్రాంతంలో గిరిజనుల జీవన శైలి సహజ పద్దతులు. 1847 లో ఒక రాజు గారి మనశ్సాంతి కోసం అడవులకు వెళ్లినప్పుడు మొదలైన కథ 1990లో ముగుస్తుంది. ఆ రాజు గారి వారసులు ఇవన్నీ కూడా కథలో బాగా చెప్పారు. మొదటి భాగం వరకూ సినిమా బాగుంది. వెరైటీగా ఉంది అనిపిస్తుంది.

Kantara Movie

 

ఇక సెకండ్ ఆఫ్ లో కథ నరనరాన మైండ్ లో జీవిస్తుంది. థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరు కథలో లీనమైపోతారు. ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠతో లీనమైపోతాారు. దానికి తోడు మధ్య మధ్యలో హీరోకి కల రావడం, దైవత్వాన్ని అధ్యాకతను జోడించడం, సెంటిమెంట్, ఎమోషన్, లైఫ్ స్టైల్, భూమిపై హక్కు కోసం వాళ్లు పోరాడటం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్క దైవత్వం మీదనో, ఆధ్యాత్మికత మీదనో ఆధారపడి ఇది తీయలేదు. అన్ని రకాలు అంటే నవరసాలు ఉన్నాయి. ఉగాది పచ్చడి లాగా నవరసాలు పండించడంతో ఈ సినిమా విపరీతంగా జనాలకు ఎక్కుతోంది. దానికి తోడు ఒక సినిమా చూస్తున్నప్పుడు కొద్దిగా తెలివైన వాళ్లు తరువాత ఏమి జరుగుతుందో ఊహిస్తారు. కానీ వాళ్ల ఊహకు అతీతంగా తెరమీద సీన్స్ కనిపిస్తే కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇదే కాంతార సినిమాలో జరుగుతోంది. క్లైమాక్స్ ఊహించవచ్చు, హీరో మీదకు ఆ దేవుడు పూనుతాడు, ఇలా ఫైట్ చేస్తాడు అని అందరూ ఊహిస్తారు. కానీ అక్కడ ఆయన పండించిన ఎక్స్ ప్రెష్స్, ఆయన చూపించిన నటన, ఆ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

సినిమా ప్రీ క్లైేమాక్స్ వరకూ ఒక ఎత్తు. బాగుంది చాలా బాగుంది అనిపిస్తే.. క్లైమాక్స్ 15 నిమిషాలు వచ్చే సరికి కంప్లీట్ గా కట్టిపడేస్తుంది. అందుకే ఆ సినిమా అంతగా ఆకట్టుకుంటోంది. నటీ నటుల ఎంపిక విషయానికి వస్తే భారీ డైలాగ్ లు చెప్పే వాళ్లను కాకుండా చాలా సింపుల్ గా యావరేజ్ గా ఉండే వాళ్లను తీసుకున్నారు.రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి మల్టీ ట్యాలెంటెడ్. రచయిత, దర్శకుడే కాక నటుడు కూడా. ఆయన నటనే హైలెట్. ఇందులో డైలాగ్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దొర డైలాగ్ లు, కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా, నాటి సమాజంలో ఉన్నతేడాను చాలా స్పష్టంగా చూపించారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంతార సినిమా అద్భుతంగా పండింది. అందులో హీరో తండ్రి నేను నర్తకుడినో, దేవుడినో చూపించాలి అంటే మీకు తెలియాలి అంటే నేను మళ్లీ వస్తే నర్తకుడిని, రాకపోతే దేవుడిని అన్నప్పుడు పేర్లు వచ్చి సినిమా ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి ఆయన హీరో తండ్రి అని తెలియడానికి ఇంటర్వెల్ కు పది నిమిషాల వరకూ ఉంటుంది.

 

ఓవరాల్ గా సీన్ కు సీన్ కి మద్య లింక్ పెట్టిన విధానం కూడా కుదిరింది. అదే విధంగా పాటలు కూడా అర్ధవంతంగా సాగాయి. అందుకే కాంతార సినిమా ఇండియన్ సినీ స్క్రీన్ మీద సంచలనంగా మారింది. కేవలం రూ.16 కోట్లు ఖర్చు పెట్టిన ఈ సినిమా దాదాపు రూ.80కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు రూ.150కోట్లకుపైగా వసూలు చేసే అవకాశం ఉంది. తెలుగులో ఇటువంటి స్టోరీలు రావు. ఇటువంటి స్టోరీలు రాసి ప్రొడ్యూసర్ ల వద్దకు తీసుకువెళ్లినా నిర్మాతలే అంగీకరించరు. హీరోల దగ్గరకు వెళ్లినా వాళ్లు యాక్సెప్ట్ చేయరు. తెలుగు లో హీరో చుట్టూ కథ తిరుగుతుంది. ఇతర భాషల్లో కథ రాసుకుని కథలో హీరో క్యారెక్టర్ ను సృష్టిస్తారు. అదే తేడా. అందుకే ఇతర భాషల సినిమాలకు కళాకంఢాలుగా నిలిచిపోతుంటే తెలుగులో సినిమాలు కమర్షియల్ మాత్రమే ఉంటున్నాయి. అయితే కమర్షియల్ సక్సెస్ లేకుంటా కమర్షియల్ ఫెయిల్యూర్స్. అంతే తప్ప ఇంకా ఏమీ లేదు.

Breaking: వివేకా హత్య కేసులో కీలక పరిణామం ..ఏపి నుండి కేసు వేరే రాష్ట్రానికి బదిలీకి అంగీకరించిన సుప్రీం కోర్టు


Share

Related posts

Virtues : మనం ఎందుకు ధర్మాలు  కలిగి ఉండాలో తెలుసా ??

siddhu

బ‌న్నితో ముచ్చ‌ట‌గా మూడోసారి…

Siva Prasad

Corona: క‌రోనాతో ప్రాణాలు పోతున్నా… ఈ పాపాత్ముల దందా ఆగ‌ట్లేదు

sridhar