NewsOrbit
Entertainment News సినిమా

Samantha: నాగచైతన్య వ్యాఖ్యలకు సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో పరోక్ష కౌంటర్..!!

Share

Samantha: నాగచైతన్య కొత్త సినిమా కస్టడీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నిన్న సమంతపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సమంతతో విడిపోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. అదే సమయంలో సమంత చాలా మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని నాగచైతన్య తెలిపారు. ఇంకా సమంతాతో విడాకులు విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సమంతతో విడిపోయి రెండు సంవత్సరాలవుతుంది అని చెప్పుకొచ్చారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అయ్యింది. న్యాయస్థానం కూడా మాకు విడవకులు మంజూరు చేయడం జరిగింది.

Indirect counter to Naga Chaitanya's comments with Samantha's Instagram post

ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగిపోతున్నాం. జీవితంలో ప్రతి దశను నేను గౌరవిస్తున్నాను అని నాగచైతన్య తెలిపారు. ఇదిలా ఉంటే సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నాగచైతన్య చేసిన కామెంట్స్ పై సమంత పరోక్షంగా స్పందించారు. “మనమంతా ఒక్కటే… ఇగోలు, నమ్మకాలు, భయాలే మనల్ని వేరు చేస్తాయి” అనే కొటేషన్ సమంత ఇన్ స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ కొటేషన్ చదివినోళ్లు అంతా.. ఇది కచ్చితంగా చైతుకి సామ్ కౌంటర్ అని అంటున్నారు. వారిద్దరు విడిపోవడానికి గల కారణాన్ని ఈ విధంగా సమంత వెల్లడించిందని నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Indirect counter to Naga Chaitanya's comments with Samantha's Instagram post

2017లో సమంతతో నాగచైతన్య పెళ్లయింది. నాలుగు సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ జంట చాలా చూడ ముచ్చటగా ఉండేది. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2021లో ఈ జంట విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. చాలా సంవత్సరాలు ఏ కారణంగా విడిపోయారు అన్నది ఎవరికీ తెలియదు. అయితే మొన్న “కస్టడీ” ప్రమోషన్ కార్యక్రమంలో.. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కారణంగా విడిపోయినట్లు నాగచైతన్య క్లారిటీ ఇవ్వటం జరిగింది.


Share

Related posts

ఆ వెబ్ సిరీస్ కి దర్శకుడిగా తేజ పేరు వేసుకోవడం లేదా ..?

GRK

బ్రేకింగ్: కరోనాతో తెలుగు నిర్మాత మృతి

Muraliak

Koratala Siva: ఆచార్యలో కాజల్ లేదు..క్లారిటీగా చెప్పేసిన దర్శకుడు..

GRK