Ram Lakshman: ఇండస్ట్రీ టాప్ ఫైటర్స్ రామ్- లక్ష్మణ్ కెరియర్లో కష్టం అయిన ఫైట్ ..!!

Share

Ram Lakshman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారు రామ్ లక్ష్మణ్ బ్రదర్స్. ఇండస్ట్రీలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన సినిమాలకు ఈ అన్నదమ్ములు ఆధ్వర్యంలో కంపోజ్ చేసిన ఫైట్లు.. అనేకమైనవి హైలెట్ గా నిలిచాయి. దాదాపు ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో పనిచేసిన ఈ అన్నదమ్ములు ఇద్దరూ వారి కెరియర్లో ఇటీవల అనేక విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Aravindha Sametha (Aravinda Sametha Veera Raghava) | Showtimes, Tickets &  Reviews - Atom Tickets

ఈ క్రమంలో కెరియర్ మొత్తంగా చూసుకుంటే అతికష్టం గా ఫైట్ కంపోజ్ చేసిన ఫైట్ బయటపెట్టరు. ఆ ఫైట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమా లోది అని తెలిపారు. ఆ సినిమా ప్రారంభంలోనే.. దాదాపు క్లైమాక్స్ లాంటి ఫైట్ పడిందని.. దానిని కంపోజ్ చేయటం బాగా కష్టంగా అప్పట్లో మారిందని, ఆ ఫైట్ కోసం ఎన్టీఆర్ బాగా కష్ట పడినట్లు అన్నదమ్ములిద్దరూ తెలియజేశారు.

Read More:  RRR : ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ 2022లోనా..?

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట’ సినిమాకి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాలో.. మహేష్ మేనరిజమ్స్ కి దగ్గరగా హావభావాలకు అనుగుణంగా ఒక ఫైట్ డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు… దుబాయ్ దేశంలో ఈ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు … పేర్కొన్నారు. కళ్లుచెదిరే రీతిలో.. ప్రొఫెషనల్ ఫైటర్ ని రంగంలోకి దింపుతున్న ట్లు సినిమాకి హైలెట్ యాక్షన్ సన్నివేశం అవుతుందని.. రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఇదే రీతిలో అనేక ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో చేస్తున్నట్లు.. కెరీర్ పరంగా ఎదుర్కొన్న అనేక ఇబ్బందులు ఎత్తుపల్లాలు గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


Share

Related posts

శివాత్మిక ఛాలెంజింగ్ రోల్

Siva Prasad

సరికొత్తగా టొయోటా ఇన్నోవా..! ఫీచర్లు అదరహో..!

bharani jella

తాను బలవంతంగా చేసిన సినిమా గురించి ధైర్యంగా బయటపెట్టిన నాని!!

Naina