సినిమా

Geetha Art’s: హైదరాబాద్ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట అర్థనగ్నంగా ఓ మహిళ నిరసన..!!

Share

Geetha Art’s: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ హైదరాబాద్ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం ఓ మహిళ అర్థనగ్నంగా నిరసన తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సునీత బోయిన్ పల్లి అనే మహిళా ఆర్టిస్ట్ తనకు.. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుండి డబ్బులు రావాలంటే ఎన్ని సార్లు అడిగినా ఇవ్వటం లేదని.. ధర్నాకు దిగింది. దీంతో వెంటనే గీతా ఆర్ట్స్ కార్యాలయం సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

infront of hyderabad geetha arts office a woman Protest

వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సునీత ఇలా చేయడం మొదటి సారి కాదు గతంలో కూడా ఫిలిం ఛాంబర్.. వద్ద నిరసన తెలిపింది. అంతకు ముందు నిర్మాత బన్నీవాసు వేధించిన సంఘటనలు కూడా సునీత పై కేసు నమోదైంది. అప్పట్లో సినిమా అవకాశాల పేరిట బన్నీవాసు తనని వేధించినట్లు ఆరోపణలు చేయడం జరిగింది. అదే సమయంలో బన్నీవాసు బెదిరిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లో సునీత ఓ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.

 

కాగా అదంతా సినిమా అవకాశాలు లేకపోవడంతో.. ఈ రీతిగా సునీత వ్యవహరిస్తున్నట్లు కొంతమంది చెప్పుకొస్తున్నారు. కేవలం పేరు సంపాదించడానికి ఆమె ఈ రీతిగా ఆందోళనలు నిరసనలు చేస్తుందని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సునీత వ్యవహారం పై కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని అంటున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ లో సునీత కి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.


Share

Related posts

 Anil ravipudi : అనిల్ రావిపూడి శర్వానంద్‌కి హిట్ ఇవ్వగలరా..?

GRK

Dhanush : ధనుష్ రెండవ సినిమాలో రజనీకాంత్ కెరీర్ లో 170వ సినిమాకి ప్లాన్స్

GRK

6 కొట్టడం కూడా కష్టమే

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar