మ‌న‌ల్ని చూసి అందరూ భయపడాలి

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. మంచి రైట‌ర్ అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న డైలాగ్స్‌కే ఫ్యాన్ష్ ఉంటారు. మాస్‌గా, ఇన్‌స్పిరేష‌నల్‌గా డైలాగ్స్ రాయ‌డంలో పూరి దిట్ట‌. ఈ విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. ఆయ‌న మ‌హేష్ కోసం సిద్ధం చేసుకున్న క‌థ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. సినిమాలో దేశ‌భ‌క్తికి సంబంధించిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ రాసుకున్నాడు. పుల్వామా దాడి త‌ర్వాత భార‌త్ పాక్‌పై దాడి చేయ‌డం.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌స్తుతం భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య యుద్ధ వాతావ‌రణం నెల‌కొని ఉంది. ఈ త‌రుణంలో పూరి జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ల‌ర్ ఖాతాలో పెట్టిన ఈ డైలాగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.
“డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి ..
STRENGTH LIES IN ATTACK,
NOT IN DEFENCE“

 

ప్రస్తుతం రామ్ హీరోగా పూరి `ఇస్మార్ట్ శంకర్` చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు. ఛార్మి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే  ఈ సినిమాకు సీక్వెల్ గా  `డబుల్ ఇస్మార్ట్` సినిమా కూడా చేయడానికి టైటిల్ రిజిష్టర్ చేయించాడు పూరి.