Salaar: `కేజీఎఫ్`తో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థార్ ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `సలార్`. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో అలరించబోతున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
`కేజీఎఫ్ 2`సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే `సలార్` సినిమా క్లైమాక్స్ కూడా సముద్రంలోనే ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. అలాగే సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఉంటుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. క్లైమాక్ కోసమే మేకర్స్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…