Naga Chaitanya: అక్కినేని నాగార్జున నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. `జోష్`తో హీరోగా ఎంట్రీ ఇచ్చి `ఏ మాయ చేసావే`తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత కొంత కాలం నుంచి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నాగచైతన్య.. చివరిగా `లవ్ స్టోరీ`, `బంగార్రాజు` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఫుల్ జ్యోష్ లో ఉన్న నాగచైతన్య.. ప్రముఖ దర్శకుడు పరశురామ్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి `నాగేశ్వరరావు` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `సర్కారు వారి పాట` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పరశురామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీ కూడా పరశురామ్ గతంలో తెరకెక్కించిన `గీత గోవిందం` తరహాలోనే ఉంటుందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
2018లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన గీత గోవిందంలో హీరోపై, హీరోయిన్ దే పైచేయి. `మేడమ్.. మేడమ్` అంటూ విజయ్ దేవరకొండ రష్మిక వెంట పడడం, వీరిద్దరి కెమెస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయం సాధించడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే నాగచైతన్య సినిమాకు సైతం పరశురామ్ మళ్లీ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులోనూ హీరోపై హీరోయిన్ దే అప్పర్ హ్యాండ్ అట. మిడిల్ క్లాస్ అబ్బాయిగా చైతు, ఓ కంపెనీ సీఈఓగా హీరోయిన్ పాత్రలను తీర్చిదిద్దారట.
ఇక హీరోయిన్ కంపెనీలో చైతు ఉద్యోగిగా చేరడం, ఆమె కోసం అతడు వెంటపడటం, వారి మధ్య కెమిస్ట్రీ వంటి అంశాలతో పరశురామ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే పరశురామ్ పాత ఫార్ములా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కాగా, చైతు ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. త్వరలోనే ఈయన `థ్యాంక్యూ`తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జూలై 8న విడుదల కానుంది. అలాగే `మానాడు` ఫేమ్ వెంకట్ ప్రభుతో ఓ మూవీ చేసేందుకు కూడా చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!