సినిమా

Pushpa 2: మ‌న‌సు మార్చుకున్న సుకుమార్‌..`పుష్ప 2`లో మ‌రో హీరోయిన్‌?!

Share

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్ విల‌న్లుగా చేశారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా ఊర‌మాస్ గెట‌ప్‌లో ప్రేక్ష‌కుల‌ను మిస్మ‌రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ మూవీకి కొన‌సాగింపుగా పార్ట్ 2 `పుష్ప ది రూల్‌` రాబోతోంది. పార్ట్ 1 హిట్టవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

వీలైనంత వరకు మేకింగ్ విషయంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇక‌పోతే పార్ట్ 2లోనూ ర‌ష్మిక‌నే హీరోయిన్ అని అనుకున్న సుకుమార్‌.. తాజాగా మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. ర‌ష్మిక‌తో పాటు మ‌రో స్టార్ హీరోయిన్‌కు చోటు క‌ల్పిస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సెకండ్ హీరోయిన్ తోను పుష్పరాజ్ రొమాన్స్ ఉంటుందని అంటున్నారు.

ఈ హీరోయిన్ ఎంపిక త్వరలోనే పూర్తి కానుంద‌ని.. బాలీవుడ్‌కు చెందిన బ్యూటీని దింపేందుకు సుకుమార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఫ‌స్ట్ పార్ట్‌లో స‌మంత చేత ఐటెం సాంగ్ చేయించిన సుక్కూ.. రెండో భాగంలో దిశా పటానీని ఐటెం భామ‌గా ఖాయం చేసుకున్న‌ట్లు స‌మాచరం.


Share

Related posts

Pushpa 2: బ‌న్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. `పుష్ప 2` కోసం అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందేనా?

kavya N

Kiara Advani: ప్రియుడికి కియారా బ్రేక‌ప్‌.. పెళ్లిదాకా వెళ్లి ఇప్పుడిలా చేశారా?

kavya N

ING: ఆసక్తిని రేకెత్తిస్తున్న “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” టీజర్..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar