సినిమా

Sarkaru Vaari Paata: మ‌హేశ్ ఫ్యాన్స్ ఈ న్యూస్ వింటే ఎగిరి గంతేయ‌డం ఖాయం!?

Share

 

Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లె చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్నఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుని మే 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసిందుకు సిద్ధం అవుతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై సూప‌ర్ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటో తెలుస్తే మ‌హేశ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేయ‌డం ఖాయం. అస‌లు విష‌యం ఏంటంటే.. మ‌హేశ్‌కు టాలీవుడ్‌తో పాటు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే.

 

ప్ర‌ధానంగా త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌లో మ‌హేశ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వారు మ‌హేశ్ తాజా చిత్ర‌మైన స‌ర్కారు వారి పాట చూడాల‌ని తెగ ఆశ ప‌డుతున్నారు. అంతేకాదు, త‌మ భాష‌లో కూడా సినిమాను విడుద‌లంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా రిక్వ‌స్ట్ చేస్తున్నారు. క‌నీసం ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో అయినా సినిమాను అందించాల‌ని కోరుతున్నారు.

దీంతో మేక‌ర్స్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. స‌ర్కారు వారి పాట తెలుగు వ‌ర్ష‌న్‌కు ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్ తో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ దిశ‌గా ప‌నులు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. ఇటీవ‌ల కాలంలో చాలా మంది ప్రేక్షకులు సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను వీక్షించేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుండ‌టం వ‌ల్లే మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. కాగా, మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.


Share

Related posts

Prabhas: సీనియర్ హీరోయిన్‌తో స్టేజ్ మీదే రొమాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

GRK

బాలీవుడ్‌కి `ఓ బేబీ`

Siva Prasad

మెగా అభిమానులకి షాక్

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar