NewsOrbit
Entertainment News సినిమా

IFFI 2023 Goa: గోవాలో ఘనంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు..!!

Share

IFFI 2023 Goa: ప్రతి ఏడాది మనదేశంలో ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటూ దేశీయ అత్యుత్తమ చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించటం కొనసాగుతూ వస్తుంది. గత 50 సంవత్సరాల నుండి ఈ ఫిలిం ఫెస్టివల్ నీ కేంద్ర ప్రభుత్వం జరుపుతోంది. ఈ క్రమంలో నవంబర్ 20వ తారీకు సోమవారం నుండి గోవా వేదికగా 54వ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించడం జరిగింది. పన్నాజీలోనే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దక్షిణాసియాలో అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ గా వేడుకలు నిర్వహించడం జరుగుద్ది.

54 International Film Festival of India celebrations started in Goa

నవంబర్ 28వ తారీకు వరకు ఈ అంతర్జాతీయ చలనచిత్రత్రోత్సవలు నిర్వహించబోతున్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు నేషనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే తొమ్మిది రోజులు జరగనున్న ఈ చలనచిత్రోత్సవ మహోత్సవంలో ఓపెనింగ్ సెర్మనిలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ మాధురి దీక్షిత్ మరియు షాహిద్ కపూర్ లు సందడి చేయడం జరిగింది. ఈ  ఏడాది ఫిలిం బాలీవుడ్ స్టార్ నటీనటులు శ్రియా శరణ్, నుష్రత్ భరుచా, పంకజ్ త్రిపాఠి, శంతను మోయిత్రా, శ్రేయా ఘోషల్ మరియు సుఖ్వీందర్ సింగ్ కూడా ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

54 International Film Festival of India celebrations started in Goa

ఈ ఫెస్టివల్‌కు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కేథరీన్ జీటా-జోన్స్, సల్మాన్ ఖాన్, విద్యాబాలన్, ఆయుష్మాన్ ఖురానా, అనుపమ్ ఖేర్, విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా, అదితి రావ్ హైదరీ, ఏఆర్ రెహమాన్, అమిత్ త్రివేది, ఇతర ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. గాయకులు మరియు చిత్రనిర్మాతలు.. కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. దేశంలో ఉన్న నటులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు చెందిన సినీ నటులు హాజరయ్యారు. ఈ క్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటించిన తో పాటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్ ఖుష్బూ.. మరి కొంతమంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ సినిమా వేడుక మరింతగా అంతర్జాతీయ స్థాయిలో.. తీసుకెళ్లడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి భారతీయ సినిమాలు పుష్ప, RRR, కేజిఎఫ్, పటాన్, జవాన్ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటటం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. దేశంలో మరింత ఉన్నత స్థాయికి సినీ పరిశ్రమ ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు స్పీచ్ ఇచ్చారు.


Share

Related posts

ఉప్పెన హీరోయిన్ కి టలీవుడ్ లో బంగారం లాంటి ఆఫర్స్ .. వదలాలన్న వదల్లేదు ..!

GRK

Nithin: మరోసారి ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న నితిన్..??

sekhar

Gunasekhar: బర్త్ డే స్పెషల్: ‘గుణశేఖర్’.. సినిమా సొగసు చూపే ఒక్కడు

Muraliak