Intinti Gruhalakshmi: ప్రేమ్ అన్నయ్య ఇంటికి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని తులసి తో చెబుతుంది దివ్య..! దివ్య కన్విన్స్ చేయడానికి తులసి శత విధాలుగా ప్రయత్నిస్తుంది..! నువ్వు నాకు నచ్చ చెప్పాలని ఎంత ప్రయత్నించినా నేను అన్నం తినను అంటుంది..!
తులసి ఏదోవిధంగా నచ్చచెప్పి అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుంది కోపంతో ఊగిపోతూ ఉన్నదిగా అన్నం పెట్టిన విసిరి నేలకేసి పడుతుంది.. కోపం వచ్చినా తులసి అన్నం విలువ తెలుసుకో.. ఏమో కడుపు కాలితే నువ్వే తింటావు.. ముందు ఆ అన్నం ప్లేట్ ని శుభ్రంగా క్లీన్ చేసి వంట గదిలో పెట్టు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రేమ శృతి కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నారా.. ఆ ఇల్లంతా ఎలా శుభ్రం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా.. అభి ఫోన్ చేస్తాడు. ఇప్పటికే ఇంటి నుంచి దూరం అయ్యాను. ఇప్పుడు మనుషులుకు కూడా.. వారి మనసులకు కూడా దూరం కావద్దు.. ప్రేమ్ అభి ఫోన్ చేస్తున్నాడని శృతి తో చెబుతాడు. ప్రేమ్ తో అభి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమని చెబుతుంది. ఇక అభి ఫోన్ ఎత్తగానే అమ్మ ఎలా ఉంది. ఏం చేస్తుంది అని వివరాలు అడిగి తెలుసుకుంటాడు ప్రేమ్. అంకిత తో శృతి మాట్లాడుతుంది. ఎక్కడ ఉన్నారో చెప్పమని అడుగుతుంది. ఒకసారి కలుద్దాం అని అడుగుతుంది. ఇప్పుడు కాదు తర్వాత కలుద్దాం అని చెబుతోంది.
లాస్య నందు ఇద్దరూ కారులో వెళ్తూ అమ్మ వాళ్ళు ఎందుకు నన్ను అపార్థం చేసుకున్నారు.. నేను చేసిన తప్పేమీ లేదు కదా అని అంటాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ అంతే నన్ను ఇంతవరకు నువ్వు పడిన కష్టాన్ని మరిచి పోయి.. ఇప్పుడు నిన్నే నిందిస్తున్నారు. నువ్వు ఆ విషయం తెలుసుకో అని అంటుంది. లాస్య మాటల మధ్యలో.. మనం ఇంట్లో నుంచి బయటకు వద్దాం అని అంటుంది. ఇప్పుడు కాదు అమ్మ నాన్నల బాధ్యత ఉంది నాకు.. ముందు ఆ శశికళ విషయంలో ఏదో ఒక క్లారిటీ రాని.. ఆ తర్వాత ఆలోచిద్దామని నందు అంటాడు. తర్వాత నువ్వు ఏమంటావో ఏమో అని లాస్య ఎప్పుడు వస్తుంది.
నందు తులసి దగ్గరకు వచ్చి ప్రేమ్ ని ఇంటికి రమ్మని చెప్పు దివ్య ఆకలితో అల్లాడి పోతుంది. ఇలా వదిలేస్తే దివ్య ప్రాణాలకే ప్రమాదం. ప్రేమ్ నీ ఇంటికి రమ్మని చెప్పు అని నందు అంటాడు. ప్రేమ్ ఈసారి ఇంటికి వస్తే మీరు ప్రేమతో గొడవ పడకుండా ఉంటారా..;! అని అడుగుతుంది గొడవ పడకుండా ఉంటాను.. నువ్వు ఇంటికి రమ్మని చెప్పు అని అంటాడు.. తులసి ఇ ప్రేమ్ నిజంగా ఇంటికి రమ్మంటుందా.. ఏమైనా కండిషన్లు పెడుతుందా..!? ప్రేమ్ శృతి ఇంటికి రావడానికి ఒప్పుకుంటారా..! లేదా..!? అనేది రేపటి భాగంలో తెలుసుకుందాం..