Intinti Gruhalakshmi: ప్రేమ్ తో మాట్లాడిన తరువాత దివ్య వెంటనే రాములమ్మను పిలిచి భోజనం వడ్డించమని అడుగుతుంది.. తులసి వడ్డించడానికి ప్రయత్నం చేస్తే తన మాటలతోనే అడ్డుపడుతుంది దివ్య.. అంతలో నందు వచ్చి దివ్య అన్నం తింటున్నందుకు సంతోషపడతాడు.. ఇదంతా లాస్య క్రెడిట్ డాడీ అనగానే నందు ఇంకా సంతోషపడతాడు.. లాస్య చేసే పనులకి దివ్య లో వచ్చిన మార్పు చూసి తులసి కన్నీళ్లు పెట్టుకుంది..!
తులసి మాధవికి ఫోన్ చేసి ప్రేమ్ ఎలా ఉన్నాడు అని అడిగి తెలుసుకోవాలి అనుకుంటుంది. ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలిస్తే ఇంకా బాధపడతాను మాధవి వద్దని అడ్డుకుంటుంది.. తులసి ప్రేమ్ ను తలచుకుని బాధపడుతూ ఉంటే.. దివ్య వచ్చి మనుషుల్ని వద్దనుకొని తరిమేశాకా ఇంకెందుకు ఈ దొంగ కన్నీళ్ళు అని ఉంటుంది. దివ్య నేను అమ్మనురా అలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావ్ నీకు మనసెలా వచ్చింది అని తులసి అడుగుతుంది.. నాకు నీ పోలికే వచ్చింది మా చిన్న తప్పు కి ప్రేమ నన్ను ఇంట్లో నుంచి పంపించేశావు.. మనసున్న మనిషి చేసే పనేనా ఇప్పటివరకు నువ్వు చేసిన పనులన్నీ.. మీ అందరి సంతోషం కోసమే ఇలా చేస్తాను. ఈ తల్లి బాధను అర్థం చేసుకో అని అంటుంది. దివ్య ఇంకా కఠినంగా మాట్లాడే అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
నీకో విషయం తెలుసా శృతి చిన్నప్పుడు మేము కూడా ఆరుబయట పడుకునే వాళ్ళం.. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు లేవు నా పక్కన అమ్మ కూడా లేదు.. నేను ఉన్నాను గా వచ్చి నా ఒడిలో తల పెట్టుకుని పడుకో అని ప్రేమ్ ను దగ్గర తీసుకుంటుంది. రేపు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. అవకాశం దొరికితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అని ప్రేమ్ శ్రుతితో చెబుతాడు.
తులసి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తుంది. నందు వచ్చి ఈరోజు దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తాను అన్నారు కదా. నువ్వు ఆఫీస్ కి వెళ్ళకుండా వాళ్ళ కి కావలసిన ఏర్పాట్లు చూడమని చెప్తాడు. దివ్య నన్ను ఉండదు అని చెప్పింది అయినా నేను ఏమైనా వంటలు చేస్తే మళ్ళీ తనకు కోపం వస్తుంది. ఇన్నిరోజులు ఎవ్వరు ఏమి అడగకముందే వాళ్ళకు అన్నీ చేసి పెట్టాను. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా నోరు తెరిచి అడిగితేనే వారికి సహాయం చేస్తాను. అంటే నువ్వు గుర్తింపు కోసమే ఇదంతా చేస్తున్నావా అని నందు అంటాడు. గుర్తింపు పోకూడదని చేస్తున్నాను.. ఆత్మాభిమానం పోగొట్టుకోకూడదు ఇన్నాళ్టికి జీవిత సత్యం తెలుసుకున్నాను. నిజంగా నా అవసరం ఉంటే వచ్చి దివ్య ను అడగమనండి. ఇప్పుడే ఆగిపోతానని తులసి అంటుంది. తులసి దివ్య చెంప చెల్లు మనిపిస్తుంది దివ్య అంతా తప్పు ఏం చేసిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..!!