Subscribe for notification

Intinti Gruhalakshmi: తులసిని వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్..! కంటతడి పెట్టిన నందు..!

Share

Intinti Gruhalakshmi: నందు కి దివ్య కాలేజ్ ని ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేసి మీ పాప ఫీజు కట్టాలి అని చెబుతారు.. సరే మేడం నేనే పర్సనల్ గా వచ్చి కడతాను అని చెబుతాడు నందు.. లాస్య వెంటనే తులసి ఫీజ్ కట్టలెనని ఒప్పుకుంటేనే ఫీజ్ కట్టు.. లేకపోతే కట్టకు అని సలహా ఇస్తుంది.. నందు ఆ మాటలు పట్టించుకోకుండా దివ్య కాలేజ్ కి వెళ్తాడు ఫీజ్ కట్టడానికి..! నందుతో ప్రిన్సిపాల్ మేడం మాట్లాడుతూ దివ్యను పిలిపిస్తుంది..!

Intinti Gruhalakshmi: 16 May 2022 Today Episode Highlights

తులసి ఫోన్ కు కాలేజ్ నుంచి ఫీజు కట్టమని ఈరోజే ఆఖరి తేదీ అని మెసేజ్ వస్తుంది. అది చూసిన తులసి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా.. దివ్య వచ్చి ఈ రోజే కాలేజీ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ మామ్.. నువ్వు కాలేజీ కి వస్తున్నావు కదా అని అడుగుతుంది దివ్య తులసిని.. ఈరోజు కాదు రేపు వస్తాను కాలేజీకి ఈ విషయాన్ని నేను మీ ప్రిన్సిపాల్ మేడమ్ కి కాల్ చేసి చెబుతాను అని అంటుంది తులసి సరే నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి దివ్య కాలేజ్ కి బయల్దేరుతుంది..

దివ్య కాలేజీలో అడుగుపెట్టగానే ప్రిన్సిపాల్ మేడం కబురు చేశారు అని తన ఫ్రెండ్ వచ్చి చెబుతుంది. అయితే ఇంకా మామ్ కాల్ చేసి ఉండదు. ఫీజు విషయం గురించి అని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న నందు కనిపిస్తాడు.. అప్పటికే ప్రిన్సిపాల్ మేడం దివ్య గురించి చాలా బ్రైట్ స్టూడెంట్ అని.. బాగా చదువుతుందనీ..

టాప్ స్కోరర్ అని చెబుతూ ఉంటుంది.. నీ కాలేజ్ ఫీజ్ కట్టడానికి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు నందు.. మీరు ఎవరు నా ఫీజ్ కట్టడానికి అని దివ్య అడుగుతుంది. ఆ విషయాలు మాట్లాడుకుందాం అని నందు అంటాడు. మేడం నా కాలేజ్ ఫీజ్ మా అమ్మ కడుతుంది. తను కట్టలేకపోతే నేను కాలేజ్ కి రావడమే మానేస్తాను. ఇలా ఎవరో వచ్చి నా ఫీజు కడతాను అని అంటే నేను ఒప్పుకోను అని చెప్పి దివ్య పక్కకు వెళ్లి పోతుంది.. బయటకు వచ్చిన నందు నాన్న మీద అంత కోపంగా ఉందా దివ్య అని అడుగుతాడు.. నాన్న అంటే ప్రతి కూతురికి ఇష్టమే నాన్న.. కానీ నాకు అమ్మను ఇష్టపడితే నాన్నంటే ఇష్టం అని దివ్య చెబుతుంది. దివ్య మాటలు విన్న నందు కంటతడి పెట్టుకున్నాడు..

Intinti Gruhalakshmi: 16 May 2022 Today Episode Highlights

తులసి జాగింగ్ కు వెళ్లి పార్కులో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉండగా.. ఇద్దరు చిన్నపిల్లలు సరిగమప అంటూ సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చెల్లి నువ్వు తప్పు పాడవు అంటూ ఆ అబ్బాయి తన చెల్లెలి సంగీతాన్ని సరిదిద్దుతూ ఉండగా.. తులసి మధ్యలో అందుకని సరిగమలు చక్కగా ఉచ్ఛరిస్తూ ఉంటుంది . దాంతో అందరూ చప్పట్లు కొడతారు.. ఆ పిల్లల తల్లి వచ్చి మీకు సంగీతం వచ్చా అని అడుగుతుంది తులసిని.. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న అంటుంది.. మీకు అభ్యంతరం లేకపోతే మా పిల్లలకు ఇప్పుడు సంగీత నేర్పిస్తారా అని అడుగుతుంది.. చెప్పినట్టు తనకు ఇష్టమైన పనే తన ఉద్యోగం అయితే చాలా బాగుంటుందని ప్రవలిక చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది తులసి.. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..


Share
bharani jella

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

40 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago