Intinti Gruhalakshmi: తులసిని నందు వాళ్ళ అమ్మానాన్నలు విషయంలో చెడామడా వాయిస్తాడు.. తులసి పెద్ద ఫెయిల్యూర్ అని అంటాడు నందు.. నేను ఫెయిల్యూర్ ఓకే.. మరి మీ చిట్టాపద్దులు లెక్కలు నన్ను చెప్పమంటారా నందగోపాల్ గారు.. మీరు అసలు ఫెయిల్యూర్ ఏ కాదా అంటూ నందు లెక్కలు తేల్చి చెప్పింది తులసి..

ఒక భర్తగా.. తండ్రిగా.. కొడుకుగా మీరు ప్రతి విషయంలోనూ ఫెయిలయ్యారు. జీవితంలో నాకెప్పుడూ సంతోషాన్ని ఇవ్వలేదు పైగా నా ముందే పరాయి స్త్రీని తీసుకువచ్చే ఇంట్లో పెట్టుకున్నారు మీరు చేసిన భరించాను నా జీవితాన్ని అన్యాయం చేసి మరొక స్త్రీ మెడలో తాళి కట్టారు భర్తగా అతిపెద్ద ఫెయిల్యూర్ మీరు మీ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించి లేక కొడుకుగా ఫెయిలయ్యారు కష్టాలు వచ్చినప్పుడు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ దారి మీరు చూస్తున్నారు. తండ్రి గా కూడా మీరు ఫెయిల్ అయ్యారు అంటూ తులసి అనడంతో.. నీ విషయంలో తప్పు చేశాను కానీ.. పిల్లల విషయంలో నేను ఓడిపోవడానికి నువ్వే కారణం. నన్ను వద్దనుకునే ఇంట్లో నేను ఉండను అంటూ నందు లాస్య ను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు.
తులసి వాళ్ళ అత్తయ్య మావయ్య లను వెతకడనికి చెప్పులు లేకుండా తిరిగి.. కాళ్లకు గాయాలు అవుతాయి. తన అరికాలు మొత్తం పుండ్లు పడి ఉంటాయి. అది చూసిన వాళ్ళ అత్తయ్య ఆయిల్మెంట్ రాయడానికి తులసి కాళ్లు పట్టుకుంటుంది. మీరేంటి అత్తయ్య నా కాళ్ళు పట్టుకోవడం వద్దు అని అంటుంది. నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని అనుకోవచ్చు కానీ.. నేను మాత్రం నిన్ను కూతురుగా చూడకూడదా.. అదే మీ అమ్మ ఇలా నీకు క్రీమ్ రాసుకుంటే.. నువ్వు వద్దు అని అనగలవా.. అంటే నీ అమ్మ గా నువ్వు ఒప్పుకోవటం లేదా.. నాకు ఆ స్థానం ఇవ్వవా అని అంటుంది. అది కాదు అత్తయ్య అంటూ దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడు. మీ అబ్బాయిని నా నుంచి దూరం చేసిన మిమ్మల్ని నాకు దగ్గరగా చేశాడు. మిమ్మల్ని నేను బాధ్యత అనుకోను మీరే నా బలం అని అంటుంది. తులసి మాటలకు సంతోషంతో పొంగిపోతూ అత్త మావయ్య..

నందు, లాస్య ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటే.. శశికళ వచ్చి మరో బాంబు పేల్చింది. నేనే నీకు 20 లక్షలు ఇస్తాను. నీ బాకీ కూడా మాఫీ చేస్తాను. కాకపోతే నువ్వే ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలి అని అంటుంది. అంతలోనే తన తోడికోడలు భాగ్యం వచ్చి ఈ ఇల్లు మీద నాకు హక్కు ఉంది. నీకు ఇల్లు అమ్మే హక్కు లేదు అక్క. ఈ ఇంట్లో నీతో పాటు నాకు కూడా హక్కు ఉంది . నువ్వు ఇల్లు అమ్మడానికి వీలు లేదు అని అంటుంది. తులసి ఏమి తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుంది.