ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి మాములిది కాదుగా.. భలే స్కెచ్ వేసింది.. ఈ సారి బలి కానుంది ఎవరంటే..!?

Share

Intinti Gruhalakshmi: దివ్య మా ఇద్దరి గొడవల వలన మీరు బాధపడకూడదు అని తులసి అంటుంది.. నేను ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేసి పేరెంట్స్ మీటింగ్ కి రమ్మని చెబుతాను.. నీకు నీ ఆత్మ అభిమానం ఎంత ముఖ్యమో.. నాకు నీ ఆత్మాభిమానం అంతే ముఖ్యమని.. అన్నింటికీ రాజీపడి నీ జీవితాన్ని నీకు కాకుండా చేసుకున్నావ్.. ఇప్పుడిప్పుడే వాస్తవం తెలుసుకుని అందరూ నీ వైపు తలెత్తి చూసుకునేలా చేస్తున్నావు.. అలాంటిది మళ్లీ ఎందుకుమా పాత తులసిలా మారిపోతున్నావ్ అని దేవి అడగగా.. నీ కోసం నీ సంతోషం కోసం అని తులసి సమాధానం చెబుతుంది..!

Intinti Gruhalakshmi: 20 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 20 Apirl 2022 Today Episode Highlights

నాకు రాజీపడే మామ్ కంటే ఆత్మాభిమానం కోసం నిలబడే మామ్ అంటే చాలా ఇష్టం.. నువ్వు అలా ఉంటేనే నాకు సంతోషం.. నీకు ఒక విషయం చెప్పనా మా డాడీ మీటింగ్ రాకుండా.. ఉండాలని నువ్వు డెసిషన్ తీసుకొని చాలా మంచి పనిచేశావు. నా భారాన్ని సగం తగ్గించావు. నా మనసులో కూడా అదే ఉంది.. డాడ్ అంటే నాకు ఇష్టం కానీ.. నీతో నడుచుకునే పద్ధతే నాకు నచ్చడం లేదు. నీకంటే ఏ విషయంలో గొప్పని నీకు అన్యాయం చేసి లాస్య ఆంటీ ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు వద్దమ్మ ఆ విషయాల గురించి ఆలోచించకు.. నీ మనసు పాడుచేసుకోకు.. నా బంగారు తల్లి నన్ను అర్థం చేసుకుంది. నాకు అదే చాలు.. వస్తానమ్మ్మ అని ఆఫీస్ కి బయలుదేరుతుండగా.. దివ్య మామ్ మా ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి నువ్వు ఒక్కదానివే వస్తానని చెప్పాను.. ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకు బాయ్ మామ్ అని చెప్తుంది..

 

అమ్మ అంకిత అభి ఎక్కడ ఈ పాలు ఇవ్వాలి అని అంటుంది. పైన ఉన్నాడు ఆంటీ అని అంటుంది. ఇవ్వండి నేను ఇచ్చేస్తాను అంటే పర్వాలేదులే అంకిత. నేను ఇస్తా అంటూ తులసి పైకి వెళుతుంది. మా అత్తయ్య ఈ మధ్య చాలా మారిపోయింది. నా మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది. మాకోసం ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనిచ్చి కీస్ ఇస్తాను అంటుంది. నా కోసం ఏకంగా హాస్పిటల్ కట్టించి ఇస్తాను అంటుంది. ఒకవైపు ఆంటీ గురించి ఆలోచిస్తుంటే అటు వెళ్దాం అనిపిస్తుంది. మరోవైపు మా అమ్మ ప్రేమ నన్ను కట్టిపడేస్తుంది. నేను ఫిక్స్ అయ్యాను రా ఆంటీ ప్రపోజల్ ఒప్పుకోవడానికి.. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదు అని తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న విషయాలన్నీ.. తులసి ఒక పక్క నుంచి వింటూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదు నా ఫ్యూచర్ గురించి.. ప్రేమ్ ఎదగడం లేదు అనే కోపంతోనే కదా.. ప్రేమ్ నీ ఇంట్లో నుంచి పంపించేసింది.. అలాంటప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అనడంలో తప్పులేదు కదా.. నా బాధను అర్థంచేసుకొని అమ్మ నన్ను ఈ జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తుందో.. అని అభి తన ఫ్రెండ్ తో మాట్లాడుతుండగా వెనక్కి తిరిగి తులసిని చూసి షాక్ అవుతాడు అభి.

Intinti Gruhalakshmi: 20 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 20 Apirl 2022 Today Episode Highlights

తులసి అభితో నువ్వు సరిగ్గా భోజనం చేయలేదు. ఖాళీ కడుపుతో ఉంటే నీకు నిద్ర పట్టదు. అందుకే పాలు తీసుకొచ్చాను. తాగు నాన్న అని తులసి అభికి తీసుకొచ్చి ఇస్తుంది. అదేంటి మామ్ మౌనంగా ఉన్నావు. ఏదోకటి మాట్లాడు అని అభి అంటాడు. నేను మా ఫ్రెండ్ తో మాట్లాడింది నువ్వు విన్నావా అని అభి అడుగుతాడు. లేదు అని తులసి అంటుంది.

 

తులసి అభి తన ఫ్రెండ్ తో మాట్లాడిన మాటల గురించి ఆలోచించి గాయత్రి కి ఫోన్ చేసింది. గాయత్రి ఏంటి తులసి నా మాట అంటే నీకు ఇష్టం ఉండదు. అలాంటిది నాకు ఫోన్ చేసావ్ అని అడుగుతుంది. మీ ఇంట్లో నుంచి వేరే వాళ్ల నుంచి కాల్ రావడం కోసం ఎదురుచూస్తున్నాను. విచిత్రం ఏమిటంటే నువ్వు ఫోన్ చేశావు జీవితం అంటే అంతే కదా.. మనం అనుకోనివే జరుగుతాయి. రేపు శ్రీ రామ నవమి కదా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం. అందుకని నిన్ను పిలవడానికి ఫోన్ చేశాను అని అంటుంది. కచ్చితంగా అందుకోసం కాదు. అసలు విషయం ఏంటో చెప్పు అని గాయత్రీ అడుగుతుంది. పండగ రోజు నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని.. నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది. అయితే అర్థమయ్యేటట్టు చెబుతాను విను అంటూ.. తులసి ఏదో ప్లాన్ గాయత్రికి చెబుతుంది.. నమ్మమంటావా నువ్వు చెప్పింది జరుగుతుందంటావా.. కాల్ చేసి నీకు చెప్పాల్సిన అవసరం లేదు వదిన.. నాకు ఇచ్చిన మాట తప్పే అలవాటు లేదు.. సరే నీ మీద నీ మాట మీద నమ్మకం ఉంచి రేపు వస్తాను. మాట తప్పితే వదిలేది లేదు అని గాయత్రీ కాల్ కట్ చేస్తుంది.. ఇక ఆ ముచ్చట ఏంటో రేపు భాగంలో తెలుసుకుందాం.


Share

Related posts

పూరి జగన్నాథ్ ఆవిష్క‌రించిన `మాయం` ట్రైలర్ లాంచ్

Siva Prasad

దర్శక దిగ్గజం ఇక లేరు

Siva Prasad

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య.. ‘మిస్సమ్మ’ వెబ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar