Intinti Gruhalakshmi: నందు ఆనందంగా శ్రీరాముడి కళ్యాణం చేయడానికి కావలసిన పూజ సామాన్లు తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి లాస్య నిద్ర లేవదు. ఏంటి లాస్య రాత్రి నీకు చెప్పాను కదా.. రేపు పొద్దున కళ్యాణం చేయాలని .. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి.. త్వరగా రెడీ అయ్యి రా శ్రీరాముడి కళ్యాణం మనిద్దరం కూర్చుని చేద్దాం అని అంటాడు నందు.. లేదు నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని లాస్య అంటుంది..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాంతో నందు కి చిర్రెత్తుకొస్తుంది. శ్రీ రాముడి కళ్యాణం శ్రీరామనవమి రోజున చేయడం మా ఇంటి ఆనవాయితీ. మనిద్దరం పీటల మీద కూర్చుని చేయాలి అంతే అంటాడు నందు.. హలో ఇలా పూజలు చేయడం నీకు ఇష్టం ఉండదు కదా. తులసి నీకు భార్యగా ఉన్నప్పుడు పూజలు , నోములు, వ్రతాలు అంటూ నన్ను విసిగిస్తుంది అంటూ.. తన మీద నాకు ఎన్నో సార్లు కంప్లైంట్ చేసావు. మరి ఇప్పుడేంటి పూజ చేద్దామని నన్ను ఫోర్స్ చేస్తున్నావు. నువ్వు నందులా ఉండు నేను లస్యలా ఉంటాను. అంతేకానీ నువ్వు మారిపోయి నన్ను మార్చకు అని లాస్య అంటుంది.. దాంతో నందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి.. లాస్య పక్కకు వెళ్ళిన తర్వాత పూజ సామాన్లు నేలపై విసిరికొడతాడు.
తులసి అభి నిద్ర లేవ్వకముందే తన దగ్గరకు వెళ్లి.. అభినీ నిద్రలేపి నాన్న అభి ఈరోజు నేనే నిన్ను రెడీ చేస్తాను. ఈరోజు నేను ఏం చేసినా నువ్వు కాదు అని అనకూడదు. ఈరోజు నన్ను నిన్ను దగ్గరగా చూసుకొని ఇవ్వరా.. రేపటి నుంచి దూరంగా చందమామ లాగా నిన్ను చూసుకుంటాను అని తులసి అంటుంది. ఇక తులసి అభికి నలుగు పిండితో తలంటి స్నానం చేయిస్తుంది. అభిని శ్రీరామచంద్రుడి లాగా రెడీ చేస్తుంది. అది చూసిన వాళ్ళ తాతయ్య అరేయ్ అభి నిన్ను మీ అమ్మ రాముని చేసింది. వనవాసం చేయవలసి వస్తుంది ఏమో చూసుకో అని అంటాడు. ఆ మాటతో తులసి షాక్ అవుతుంది.
అంకిత ఇంటి పెద్ద కోడలు హోదాలో దీపం వెలిగించి పూజ మొదలు పెట్టమని తులసి అంటుంది. అదేంటి తులసి ఎప్పుడూ నువ్వే కదా ఇంట్లో దీపం పెట్టేది. ఆ అర్హత నీకే కదా ఉంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఈరోజు వీళ్ళిద్దరి చేత పూజ చేయించాలని నేను ముచ్చట పడుతున్నాను అత్తయ్య. నా కోరిక మన్నించండి అని అంటుంది తులసి. అంకిత అభి ఇద్దరూ కలిసి శ్రీ రాముడి కళ్యాణం చేస్తారు. ఇక తులసి చెప్పినట్టుగా తన ప్లాన్ ప్రకారం గాయత్రి ఆ ఇంటికి వస్తుంది. తులసిని మీ ఇంట్లో నుంచి అభిని తీసుకువెళ్ళమని నాకు చెప్పింది అని అంటుంది. ఇక అంకిత కూడా వాళ్ళమ్మతో వెళ్లడానికి సిద్ధం అవుతుంది. అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి తులసి ఏమైనా ఒప్పించిందా.. లేదంటే కోపంతో వెళ్ళిపోతుందా అనేది తెలియాలి అంటే రేపటి భాగంలో తెలుసుకుందాం..