Intinti Gruhalakshmi: అభి ని కాపాడుకోవడం కోసం తులసి అన్ని మెట్లు దిగి.. రాత్రిపూట ఎస్ఐ మనసు మార్చడానికి బార్ కి వెళుతుంది.. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మగా చేయాల్సిన ప్రయత్నాలు చేసి అలసిపోకుండా.. దారులన్నీ మూసుకుపోయినా కూడా తులసి కన్నీళ్లతో తన కాళ్లు కడగాలని ఎస్ఐ దగ్గరకు వెళుతుంది..!!
వాళ్ళకి అడుగు పెట్టడంతోనే చుట్టుపక్కల ఉన్న జనాలు నానారకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అవేమీ పట్టించుకోకుండా తులసి మౌనంగా ఎస్సై దగ్గరకు వెళ్ళి నిల్చుని ఉంటుంది.. ఇక ఈ ఎస్సై కూడా నీచంగా మాట్లాడడంతో.. అర్ధరాత్రి పూట రాకూడని చోటికి రావడంతోనే సగం చచ్చిపోయాను నా చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు తో మీ ముందు ఇలా నిస్సహాయంగానే చేయడంతోనే పూర్తిగా చచ్చిపోయాను మీరు అనే మాటలు నన్ను ఏమి బాధ పెట్టావు నా కన్నీళ్లను మీరు ఆ మందులో కలుపుకుని తాగిన పర్వాలేదు.. అభి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతుంది..
కన్నీళ్లతో కరిగిపోయే రకం కాదు నేను.. నువ్వు ఎంతగా అడిగినా అభి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పనని ఆ ఎస్సై అంటాడు.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా మాట్లాడటంతో.. కోపం వచ్చిన తులసి అభిని మీరు చిట్టడవిలో పెట్టినా కూడా ఈ అమ్మ వెతికి తీసుకువస్తుందని.. అభిని ఈ తల్లి బ్రతికించు ఉంటుందని చెబుతుంది.. ఏంటి నాకే ఛాలెంజ్ విసురుతున్నావా అని ఎస్ఐ అంటాడు.. కాదు ఇది అమ్మ ప్రేమ.. ఓ తల్లిగా నేను పడుతున్న వేదన.. ఈ తల్లి ఎలాగైనా వెతికి అభిని తీసుకు వస్తుందని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తులసి అర్ధరాత్రి సమయంలో ఇంటికి రావడం నందు చూస్తాడు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్లావు అని తులసిని నిలదీస్తాడు. అభి కోసం ఎస్ఐ ని కలవడానికి బార్ కి వెళ్ళను అని చెప్పడంతో.. తులసిని నందు నానా మాటలు అంటాడు. మీరు ప్రయత్నం చేయరు నేను ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి తిడతారు. మరి అభి నీ కాపాడుకోవడం ఎలా ఎలా మీరు కాపాడి తీసుకు వస్తారు అంటే చెప్పండి నేను ఇంట్లో కూర్చుంటాను అని తులసి అంటుంది మీరు చేయడం లేదు కాబట్టే నేను చేస్తున్నాను అది ఎలాగైనా కాపాడు తీసుకు వస్తాను అని అంటుంది. నువ్వు బొక్కబోర్లా పడినప్పుడు నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వే నా కాళ్లబేరానికి వస్తావు .. నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది అని నందు అంటాడు.
తులసి మాట్లాడిన మాటలకు కోపం వచ్చిన తులసి అభిని ఇంకా టార్చర్ చేస్తాడు. తన మనుషుల చేత చిత్రవధ చేస్తాడు.. దారుణంగా అభిని హింసిస్తాడు.. కర్రలతో కొట్టడంతో అభి స్పృహ తప్పి పడిపోతాడు.. ఇక వీడు లేవటం లేదు అని చెప్పడంతో ఇవన్నీ మనకు మామూలే గా కాసిన్ని నీళ్ళు కొట్టి నెక్స్ట్ రౌండ్ మొదలుపెట్టండి అంటాడు. అలా కాదులే అని అభి దగ్గరికి వెళ్లి చూడగా.. తన ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతుంది వీడు చనిపోయాడు అని చెప్పడంతో.. ఆ ఎస్సై షాక్ అవుతాడు.. ఇప్పుడు అభి నీ ఆ ఎస్సై ఏం చేస్తాడు.. తులసి అభిని కాపాడుకోవడానికి ఏ విధంగా పోలీస్ స్టేషన్ ఎదుట టెంట్ వేసి కొడుకుని నాకు అప్పగించాలంటూ బోర్డు పెడుతుంది.. ఇక తులసి చేసిన ఈ పనికి అభి చనిపోయాడని ఎస్ఐ చెబుతాడా.. లేదంటే అభిని తులసి అప్పగిస్తాడా.. ఈ కథ ఎటు వైపు మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..