Intinti Gruhalakshmi: అమ్మా తులసి నువ్వు జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నావో తెలుస్తుందా అని వాళ్ల మావయ్య అంటాడు.. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా తులసి.. నేను తీసుకున్న నిర్ణయం తప్పయితే అభి ఇంట్లో నుంచి వెళ్లేవాడే కాదు మామయ్య.. వాడి మనసులో వెళ్లాలని ఉంది కాబట్టే.. అయిష్టంగానైన వాడు వెళ్ళాడు అని అంటుంది తులసి..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అభిని పరీక్షిస్తున్నావా తులసి అని వాళ్ళ మావయ్య అంటే.. కాదు తల్లి ప్రేమను పరీక్షిస్తున్నారు.. ఓడిపోతే.. నా కొడుకు గెలిచినట్టు.. లేకపోతే తల్లి ప్రేమ గెలిచినట్టు.. అభిరామ్ వెళ్ళింది వాడు కోరుకున్న చోటికి.. జీవితంలో ఎదగడానికి.. ఈ అమ్మ బాధపడాల్సిన పనిలేదు. ఉన్న ఇద్దరు కొడుకులను దూరం చేసుకున్నావు. భవిష్యత్తు ఏమిటా అని భయం లేదా అని వాళ్ళ మావయ్య అడుగుతాడు.. ఏ ఆశ లేని నేను దేని గురించి భయపడాలి మావయ్య.. నా సంతోషం కోసం నా పిల్లలు నా చుట్టూ ఉండాలి అనుకోవడం స్వార్థం కదా మావయ్య.. పిల్లలకి జన్మనిచ్చింది వాళ్ళ బ్రతుకులు వాల్లనే బ్రతకమని.. మనకోసం బ్రతకమని కాదు. నాకు కావాల్సింది కళ్ళముందు ఉండడం కాదు.. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటాం..
తులసి ఆఫీస్ కి బయలుదేరుతుండగా వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తాడు. ఆఫీస్ కి బయలుదేరుతున్నాను మేనేజర్ గారు అని తులసి చెబుతుండగా.. మేడం ఇక్కడకి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. మన ఫ్యాక్టరీని మూసేస్తాం అంటున్నారు. స్టాఫ్ అందరినీ బయటకు పంపించేశారు. మీరు అర్జెంట్ గా రావాలి మేడం అని అంటాడు. నేను వెంటనే వస్తున్నాను. నేను వచ్చేవరకు వాళ్ళను ఆపండి అని తులసి అంటుంది. తులసి ఫ్యాక్టరీ దగ్గరకి వెళ్లి మున్సిపల్ అధికారులను అడ్డుకుంటుంది. మీరు మాకు అడ్డుపడితే పోలీసులను పిలిపించాల్సి ఉంటుంది. మిగతావి కోర్టు లో చూసుకోమని ఫ్యాక్టరిని సీజ్ చేస్తారు. లాస్య తో భాగ్య చెప్పిన యధావిధిగా అమలు చేస్తుంది.
లాస్య ద్వారా తులసి ఫ్యాక్టరీ సీజ్ చేసిన విషయం తెలుసుకున్న నందు తులసి పై చిందులు తొక్కుతాడు. ఇదంతా నీ చేతకాని తనం అంటూ నిందిస్తాడు. అభి కూడా అమ్మకు అండగా నిలవక పోగా తను కూడా అమ్మను నిలదిస్తాడు. ప్రేమ్ వచ్చి అమ్మకు అండగా నిలవాల్సిన మీరు అమ్మను నిలదీస్తున్నరా అంటూ అభికి చివాట్లు పెడతాడు ప్రేమ్.. ఇక ఆ ముచ్చట్లు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.