ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: లాస్యను సేవ్ చేయడానికి వచ్చిన గాయత్రికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే..!? 

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆపోజిట్ క్యారెక్టర్ చేత ట్విస్టులు వేయిస్తూ.. పాజిటివ్ క్యారెక్టర్స్ తో వాళ్లకి రివర్స్ తిరిగేలా చేస్తూ.. చక్కటి స్ట్రాటజీ ప్లే చేస్తూ టీవీల ముందు నుంచి కదలనివ్వడం లేదు.. ఇవాళ్టి 539 వ ఎపిసోడ్లో ట్విస్ట్ కి రివర్స్ పంచ్ లు గట్టిగానే పేలాయి.. ఆ సంగతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Intinti Gruhalakshmi: 26 Jan 2022 539 Episode Highlights
Intinti Gruhalakshmi: 26 Jan 2022 539 Episode Highlights

539 వ ఎపిసోడ్ హైలెట్స్..!!

 

తులసి ఇచ్చిన ఐడియా సక్కగా అమలు చేశాడు నందు.. దాంతో ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి కేఫ్ అంతా కస్టమర్ తో నిండి పోయింది దాంతో రవి వచ్చి నందుని మెచ్చుకోవడం తోపాటు ఉ ముందు ముందు నువ్వు జీవితంలో లో ఎక్కడికో వెళ్లిపోతారు అంటూ అభినందిస్తారు ఇక దీనంతటికీ కారణం తులసి ఐడియా నే అని మనసులో తులసి థాంక్యూ చెప్పుకుంటాడు.. ఇప్పటికి గాని నందు కి తులసి విలువ తెలిసి వచ్చింది. నందు కి తులసి విలువ తెలిసింది కానీ లాస్య మాత్రం తనని ఎలా ఓడించాలని సైలెంట్ గా స్కెచ్లు వేస్తూనే ఉంటుంది.. ఇప్పుడు లాస్య కి అంకిత వాళ్ళమ్మను బల్లెం గా చేసి ఇంటిలో కోడి పందెం కి దింపుతుంది..

 

లాస్య అంకిత వాళ్ళమ్మ గాయత్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది.. అంతలో నేను వచ్చేసా అంటూ గాయత్రి కూతురు దగ్గరకు వచ్చినా కూడా పట్టించుకోకుండా.. లాస్యను హత్తుకుంటుంది. ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది.. ఇక అంకిత అమ్మ అంటూ గాయత్రి ను హగ్ చేసుకోగా.. చిక్కిపోతున్నావ్ ఏంటమ్మా అని అంకిత ను ప్రశ్నిస్తాడు.. అమ్మలకి ఎప్పుడు అత్తారింట్లో ఉన్న కూతురు చిక్కిపోతున్నట్టు గానే కనిపిస్తారు.. అది మామూలే అని వాళ్ళ నానమ్మ అంటుంది. బాగున్నారా పిన్ని గారు ఏం మరాలా అని గాయత్రి అనడంతో.. ఏంటి నేనా..!? కాదు నీ మాట తీరు..! బాగున్నావా వదినా అని తులసి పలకరించగా.. మా ఇంట్లో ఏం తలనొప్పులు ఉండవు కదా వదినా మేం బాగానే ఉంటాం. వేరే వాళ్ళ ఇంట్లో తలనొప్పులు పెట్టకుండా ఉంటే వాళ్లు కూడా బాగానే ఉంటారు అంటూ అనసూయమ్మ రివర్స్ పంచ్ పేలుస్తుంది.. సరదాగా అన్నాను అంటూ గాయత్రి అని అంటుంది. అవును పిన్ని గారు మీ అబ్బాయి రెండో పెళ్లి చేసుకున్న కూడా రెండో భార్య ఇదే ఇంట్లో ఉంటుందేంటి. ఇది కూడా జోక్ ఆ.. అనడంతో ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అంతలో అంకిత మామ్ ఏంటిది.. చుట్టం చూపుగా వచ్చావు.. చూసి వెళ్ళిపో.. కూతురుగా నేను పూజ చేస్తున్నాను కావాలంటే నాలుగు అక్షింతలు వేసి వెళ్ళిపో.. అంతేగాని ఏంటి ఈ మాటలు అనగానే..

 

 

మీ నానమ్మ అంటే జోక్ కా నేనంటే డోకా.. అయినా నేనేమైనా తప్పుగా మాట్లాడానా. బయటా పబ్లిక్ మాట్లాడుకునే టాక్ మీకు చెప్పాలి గా.. మా ఆంటీ ఇంట్లో ఉంటే మీకు మీ పబ్లిక్ కి వచ్చి నష్టం ఏంటో అని శృతి ప్రశ్నిస్తుంది.. అలా కాదు గాని లాస్య పబ్లిక్ టాక్ కి వెళ్దామా. ఏది కరెక్టో ఏది రాంగో తేలిపోద్ది అని లాస్య ను అడగడంతో.. వద్దులే గాయత్రీ ఇంటి పరువు రచ్చకిడ్వవడం నాకు ఇష్టం లేదు.. కోడలిగా అది నా బాధ్యత అంటూ లాస్య అలా చెప్పడంతో.. వెంటనే గాయత్రి కోడలు అంటే ఇలా ఉండాలి ఇది పద్ధతి అంటే.. అని ఇంట్లో నీకు అంతా బాగానే జరుగుతుందా.. అని అడగడంతో నేను ఒక్కదానినే ఒంటరి పోరాటం చేస్తున్నా.. కనీసం నీ ముచ్చట్లైన తీరుస్తున్నరా.. పూజ చేస్తున్నావా అని అడిగి చేయటం లేదు అని తెలుసుకుని.. అందరికీ నాలుగు చివాట్లు పెట్టీ ఎలాగోలా లాస్య చేత పూజ చేయడానికి అనసూయమ్మ కాదు అనలేకుండా చేస్తుంది..

Intinti Gruhalakshmi: 26 Jan 2022 539 Episode Highlights
Intinti Gruhalakshmi: 26 Jan 2022 539 Episode Highlights

ఇక లాస్య కు అంతా ఫేవర్ గా జరిగితే.. సీరియల్ లో కిక్ ఏముంటుంది.. లాస్య పూజల కూర్చొని వాళ్ళ అత్తయ్య చెబుతున్న పూజ చేయిస్తుండగా లాస్య కు నందు నుంచి ఫోన్ వస్తుంది అర్జంటుగా కేఫ్ కి రమ్మని.. లాస్య చెప్పేది వినకుండానే నందు కాల్ కట్ చేస్తాడు. ఇక లాస్య ఏం చేయలేక ఇప్పుడే వస్తా అంటూ అక్కడి నుంచి లేచి లాస్య వెళ్ళిపోతుంది. నందు కావాలని లాస్య పూజ చేయకుండా ఉండటానికి ఫోన్ చేశాడా..!? అప్పటివరకు కేఫ్ అంతా జనాలతో నిండి ఉండటంతో ఏదైనా రచ్చ జరిగిందా..!? ఈ చిక్కుముడి వీడాలి అంటే తరువాయి భాగం వరకు ఆగాల్సిందే..!


Share

Related posts

Women: అందమైన నడుము,పొట్ట కావాలనుకునే అమ్మాయిలు.. ఇలా చేసి చూడండి !!

Kumar

Crack Knuckles: చేతివేళ్ళు మెటికలు విరుస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

bharani jella

టిక్ టాక్ లాంటి యాప్ వచ్చేసింది…!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar