Subscribe for notification

Intinti Gruhalakshmi: లాస్య చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..! తులసి పై లాస్య ఫైర్..!

Share

Intinti Gruhalakshmi: ఇంట్లో అనసూయమ్మ, పరంధామయ్య, తులసి కలిసి మాట్లాడుతుండగా డెలివరీ బాయ్స్ వచ్చి సరుకులు ఇంట్లో పెడుతూ ఉంటారు.. ఏ ఇంటికి తీసుకు వచ్చారు బాబు అని వాళ్లు అడగగా ఇది లాస్య మేడం ఇల్లేనా అని అడుగుతారు.. వాళ్ళ అత్తయ్య రివర్స్ లో మాట్లాడుతుండగా తులసి లాస్య ఇల్లు ఇదే అంటుంది.. ఇక లాస్య సీన్ లోకి ఎంటర్ అవుతుంది.. నేనే తెప్పించా ఏ ఈ ఇంటి కోడలిగా సరుకులు తెచ్చే హక్కు కూడా లేదా అని అంటుంది..!!

Intinti Gruhalakshmi: 31 Jan 2022 Today Episode overview

అంతలో వాళ్ల అత్తయ్య ఇంతకీ ఇన్ని సరుకులు ఏం చేద్దాం అనుకుని అంటుంది.. లాస్య తను రాసిన సరుకులు లిస్ట్ చదువుతుంది.. 50 కేజీలు ఉప్పు ఏం చేద్దాం అనుకునే 50 పాకెట్స్ తెప్పించవు.. అది నా నెత్తిమీద పొయ్యడానికా.. 25 కేజీలు చింతపండు అని లాస్య అనగానే రేపటి సబ్బుతో కాదు చింతపండు గుజ్జుతో అందరూ స్నానం చేయాల అంటూ ఫన్ బాంబ్ పెలుస్తుంది. ఇక 5 కేజీలు మిరపకాయలు ఎందుకే అన్ని నీ దుంప తెగ.. ఆవాలు 5 కేజీలు అందుకే అన్ని నువ్వు మీ ఆయన కూర్చుని తలంబ్రాలు పోసుకుంటారా.. అంటూ అనసూయమ్మ వేసే పంచులు మామూలుగా ఉండదు.. ఈ సంభాషణలు జరుగుతున్నంత సేపు నవ్వు ఆపుకోలేరు. కందిపప్పు అరకిలో ఏమ్మా అంత పాపం.. అరకిలో కందిపప్పు ఈ ఇంట్లో ఒక్క పూటకు కూడా సరిపోదు.. అయిన సరుకులు రాసేటప్పడు ఒక్కసారి తులసిని అడగచ్చుగా అంటూ అత్తమామలు తులసి ని మెచ్చుకోగా.. లాస్య తులసిని తిడుతుండగా మాధవి వస్తుంది. తన వదినను అనే హక్కు నీకు లేదంటూ లాస్యకు లెఫ్ట్ రైట్ ఇస్తుంది. రాములమ్మ నీ ఆ సరుకులు ఇంట్లో పెట్టమని లాస్య వెళ్ళిపోతుంది.

Read More: Devatha Serial: మాధవ్ నీ దేవుడమ్మ అంత మాట అనేసిందా..!? ఈ యాక్షన్ డ్రామా మిస్ అవ్వకండి..!

ఇక మాధవి తులసి తో నేను నీకు తెలియకుండా ఒక తప్పు చేశాననీ.. అభి కి లక్ష రూపాయలు ఇచ్చానని ఏదో బిజినెస్ కోసం అవసరమని అడిగితే ఇచ్చానని చెబుతుంది. అభి చాలా మరిపోయాడని మీ అన్నయ్య తీరు వచ్చిందని చెబుతుంది. సరేలే చెప్పి మంచి పని చేశావని మాట్లాడుకుంటుండగా.. అంతలో మాధవిని వాళ్ళ అమ్మ పిలుస్తుంది.

 

అంకిత కు జాబ్ వచ్చిందని తులసి శృతి కి చెబుతుంది. తులసి అంకిత నోట్లో పంచదార పోస్తుంది. వాళ్ల మవాయ్య స్వీట్స్ చేయాలి అని అంటుండగా.. గాయత్రి ఎంట్రీ ఇచ్చి కష్టం నాదైతే సంతోషం మీదని అంటుంది. ఎప్పుడు ఎందుకు మమ్మీ ఎలా మాట్లాడతావని అంకిత వాళ్ల అమ్మ ను ప్రశ్నిస్తుంది. నీకు రెండు విషయాల్లో క్లారిటి ఇవ్వాలి మామ్.. నువ్వు చెప్పావని జాబ్ చేయడానికి వెళ్ళలేదు.. నువ్వు చెప్పిన కార్పొరేట్ హాస్పిటల్ కి ఇంటర్వ్యూ కి వెళ్లలేదని అంకిత వాళ్ల అమ్మ కు క్లారిటీ ఇస్తుంది. ఇక అంకిత మాటలు విన్న గాయత్రి ఎలా రియక్ట్ అవుతుందో తరువాయి భాగంలో చూడాలి.


Share
bharani jella

Recent Posts

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

27 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

4 hours ago