Intinti Gruhalakshmi: లాస్య తులసిని తన నోటికొచ్చిన్నట్లుగా తిడుతూ ఉంటుంది. అది చూస్తూ నందు మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ్ కి కోపం వచ్చి లాస్య ను కూడా తిడతాడు. ఇక ప్రేమ్ ను రెచ్చగొట్టడానికి ఇష్యూ నీ పెద్దది చేయడానికి లాస్య ఇంకా రెచ్చిపోతుంది..!!
ప్రేమ్ వద్దన్న కొద్దీ లాస్య ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. మీ అన్నయ్యను తన అత్తారింటికి దూరం చేసింది. అంకితను తన పుట్టింటికి దూరం చేసింది. నీ మీద ప్రేమతో నీకు శృతిని ఇచ్చి పెళ్లి చేసింది అనుకుంటున్నావా.. నీకు కోటీశ్వరుల సంబంధం వస్తే అది కాదని శృతి తో నీ పెళ్లి ఎందుకు చేసిందో తెలుసా.. కోటీశ్వరులు ఇంటి పిల్ల వస్తే తన మాట వినదని.. నువ్వేమో అమ్మ నీ మీద ప్రేమతో చేసిందని భ్రమలో ఉన్నవ్.. ఇక అత్తయ్య మావయ్య గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నేను కోడల్ని కాదు కూతుర్ని అంటూ మావయ్య గారి చేత ఏకంగా ఈ ఇంటినే రాయించుకుంది.. మీ అమ్మ అమాయకంగా కనిపించినా నిలువెత్తునా స్వార్థంతో నిండి ఉంటుంది.. శశికళ డబ్బుల విషయంలో కూడా తులసి పాత్ర అ ఉందనిపిస్తుంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత అని లాస్య మాటలు విన్న.. ప్రేమ్ కోపంతో లాస్య ను కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు.
నీకు ఎంత ధైర్యం రా నా ముందే నా భార్య ని కొట్టడానికి చెయ్యి ఎత్తుతవా అని నందు ప్రేమ్ చెంప చెల్లు మనిపిస్తాడు. ఇక ఆగకుండా ప్రేమ్ ను కొడుతూ ఉంటాడు. ప్రేమ్ కూడా నాన్న అని పట్టించుకోకుండా నందు చొక్కా పట్టుకున్నాడు. ఇదంతా చూసిన తులసి ప్రేమ్ ను వెనక్కి లాగి చెంప చెళ్లుమనిపించింది.. ఇదేనా నా పంపకం.. ఇదేనా నా పెంపకానికి నిలువెత్తు నిదర్శనం.. నువ్వు కూడా మారిపోయావు అని నాకు అర్థం అయిపోయింది. మర్యాదగా ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపో అని అంటుంది. ప్రేమ్ వాళ్ల అమ్మ కాళ్లు పట్టుకుని నన్ను క్షమించు అమ్మ.. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని అంటాడు. తులసి అవేమి పట్టించుకోకుండా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే సరే.. లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఉంటుంది. ఇక ప్రేమ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా శృతిని తీసుకొని వెళ్ళి పోతాడు. ఇప్పటికైనా తెలిసిందా నందు తులసి ప్లాన్ ఏంటో నువ్వు అందరిముందు హైలెట్ అవ్వడం ఇష్టం లేదు అందుకోసం తన స్వార్ధ నిలబెట్టుకోవడం కోసం ప్రేమ్ మీ ఇంట్లో నుంచి పంపిచేస్తుంది. ఇక నందు కూడా లాస్య చెప్పే మాటలకు తలొగ్గి నిజమైనని అనుకుంటాడు. ఇకమీదట నుంచి తులసి ఇ పాటలు నా ముందు చల్లని తను చేసే పనులకు అడ్డుపడతారని నందు లాస్య కు మాట ఇస్తాడు.
Read More: Devatha Serial: వీడియో కాల్ లో ఆదిత్య ఉన్నాడని తెలియక రాధ దేవిని ఆ విషయం అడిగి నిజం తెలుసుకుందా.!?
ఏంటి మావయ్య జరిగిందని గురించి ఆలోచిస్తున్నారా అని తులసి అడుగుతుంది. లేదమ్మా తులసి నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. రేపు ఎప్పుడైనా మేము కూడా ఏమైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఇలాగే ఇంట్లో నుంచి గెంటేస్తావా అని అడుగుతాడు. ఏంటి మావయ్య నేను మీ కళ్ళకి అంత రాక్షసిలా కనిపిస్తున్నానా.. నా గురించి అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపొస్తుంది. నేను ఈ పని ఎందుకు చేశానో మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.. ప్రేమ్ నా మీద ప్రేమతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను వదిలేసి ఉంటున్నాడు. ఈ అమ్మ జీవితకాలం తనకి తోడుగా ఉండలేదు అలా అని తన జీవితాన్ని నా చేతిలోకి తీసుకొని బాగు చేయను. ఇలా ఇంట్లో నుంచి దూరంగా పెడితే అమ్మ తో పాటు తన జీవితంలో కూడా తెలిసి వస్తుందని అనుకుంటున్నాను. ఇక పొద్దున జరిగిన అవకాశాన్ని ఆయుధంగా చేసుకుని ఇంట్లో నుంచి బయటకు పంపించను. నా మీద తనకి కోపం రావచ్చు కానీ తన మీద నాకు ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. తను బాగుపడితే నాకు అదే చాలు మావయ్యా అని తన మనసులో మాటను చెబుతుంది. ఇక ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడు తరువాయి భాగంలో తెలుసుకుందాం.