Intinti Gruhalakshmi: భాగ్య లాస్య ఇద్దరు తులసి ఇల్లు అమ్మకుండా ఉండటానికి ప్లాన్ వేసుకుంటారు..! నువ్వు ఎంత చెబితే అంత లాస్య అని భాగ్య లాస్య కి సపోర్ట్ చేస్తుంది.. ఏది ఏమైనా నాకు నా వాటా కావాలి.. అందుకోసం నేను ఎంతవరకైన తెగిస్తాను అని భాగ్య అంటుంది. నువ్వు ఈ మాట మీద నిలబడు.. తులసి నీ దగ్గరికి తగ్గి వస్తుంది అని లాస్య అంటుంది.. తులసి ఇల్లు అమ్మకుండా ఉండటానికి ఇద్దరూ సెచ్ వేసుకుంటారు..!
లాస్య తులసి కి ఫోన్ చేస్తుంది. ఏం తులసి ఇల్లు అమ్మడానికి సిద్ధమై పోయావా అని అడుగుతుంది. నీకు కావాల్సింది అదే కదా అని అంటుంది తులసి. నువ్వు ఈ ఇల్లు అమ్మ లేవు. భాగ్య నేను ఎక్కుపెట్టిన బాణం. నీ ఆటలు ఇక సాగవు. నీ లెక్కల్ని నా బాణం చిత్తు చేస్తుంది చూస్తూ ఉండు అని లాస్య అంటుంది. బాణం ఎక్కుపెట్టగానే యుద్ధం గెలిచినట్టు కాదు అని తులసి అనగానే.. భాగ్య మాటలకి మొన్న నువ్వు వెనక్కి తగ్గినప్పుడే సగం నేను గెలిచాను. ఇది కేవలం గెలవడానికి చేసే పోరాటం మాత్రమే అని అంటుంది.
ఓటమికి గెలుపు కి మధ్యన ఉన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితే ఓటమి గెలుపు అవుతుంది. గెలుపు ఓటమి అవుతుంది ఓడిపోతానని తెలిసినా కూడా బలే కాన్ఫిడెంట్ గా మాట్లాడతావు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. రేపు ఇల్లు అమ్మకుండా ఉండటానికి భాగ్య కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొస్తుంది. ఆల్ ది బెస్ట్ తులసి.. టేక్ కేర్ తులసి అని లాస్య ఉంటుంది. శశికళకు ఇల్లు అమ్మడం తప్పా తులసికి మరో దారి లేదు. భాగ్యను ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటుంది తులసి . భాగ్యను కలిసి మాట్లాడాలి అని అనుకుంటుంది.
ప్రేమ్ బప్పి లహరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి కలుస్తాడు. ప్రేమ్ పాటను వినకుండా ప్రేమ్ ను పట్టించుకోకుండా తన పనిలో తను ఉంటాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్. అవకాశం ఇప్పటికీ ఇవ్వమంటే నేను ఇవ్వను. నీకు జీతం కూడా నాకు నచ్చినంత నాకు నచ్చినప్పుడు మాత్రమే ఇస్తాను. అవకాశం వచ్చినప్పుడు నిన్ను ఎలాగోలా తోసేస్తాను. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టడం చేస్తే ఈ ఛాన్స్ కూడా ఇవ్వరు అంటాడు. ప్రేమ్ కి ఒక్కసారి శృతి మాటలు గుర్తుకు వస్తాయి. మనం ఒకరి దగ్గర తగ్గాము అంటే మన విలువ తగ్గినట్టు కాదు. ఒక్కసారి తగ్గితే అంతకుమించి గెలుస్తామని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోమని శృతి అన్న మాటలు గుర్తు చేసుకుని ఆ డైరెక్టర్ దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటాడు ప్రేమ్.
తులసి భాగ్య దగ్గరకు వెళ్లి మాట్లాడదాం అనుకునేలోపు.. భాగ్య వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెబుతుంది. కోర్టుకు వెళ్లి తులసి అక్క ఇల్లు అమ్మకుండా స్టే ఆర్డర్ తీసుకురావాలి. మనం తీసుకునే వరకు ఎక్కడి నుంచి కదలకూడదు మీరు త్వరగా రండి అని భాగ్య ఫోన్ చేస్తుంది ఆ మాటలు విన్న నేను ఆగలేకపోతున్నా నా ప్రయత్నాలు నేను ఉండాలి కదా అని అంటుంది. భాగ్య శశికళకు ఇల్లు అమ్మడం తప్ప మరో దారి లేదు అని అంటుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అక్క. నీ నిర్ణయం ఏంటో నాకు తెలియాలి అది చెప్పు అని అంటుంది. తులసి నిర్ణయం ఏంటి.. ఇల్లు అమ్మడానికి భాగ్యను ఎలా ఒప్పిస్తుంది.. లాస్య ప్లాన్ ఎలా చిత్తు చేస్తుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.