NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి చేతి వంట తిన్న ప్రేమ్, శృతి..!  ట్విస్ట్ అదిరిపోయింది..!

Intinti Gruhalakshmi: ప్రేమ్, శృతి ఒక అమ్మవారి గుడిలో ఉంటారు.. ఏం చేద్దాం ప్రేమ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం.. ఇంత రాత్రి టైం లో ఎక్కడికి వెళ్ళినా రిస్క్.. ఈ రాత్రికి ఎలాగోలా ఇక్కడే ఉండి.. రేపు ఉదయం ఎటైనా వెళ్దామని ప్రేమ్ శృతి అనుకుంటారు..

Intinti Gruhalakshmi: 8 march 2022 today episode highlights
Intinti Gruhalakshmi 8 march 2022 today episode highlights

ప్రేమ్ శృతి దగ్గరకు వచ్చి పంతులు గారు మీది మీ ఊరేనా అని అడుగుతారు. ఏం లేదు పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నారు కదా.. అందుకే అడుగుతున్నాను. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి వెళ్ళి మీ పెద్ద వారితో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తారు. సమస్య ఏమిటంటే పెద్దవారే మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారని ప్రేమ్ చెబుతాడు. మీ సమస్య విన్నా కూడా నేను ఏమీ చేయలేని పరిస్థితి. గుడిలో ఎవరూ ఉండటానికి వీలు లేదు. గుడిమూసే సమయం కావస్తోంది. దయచేసి మీరు ఏమీ అనుకోకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోండి అని పంతులు చెబుతారు. ఇక చేసేది ఏమీ లేక ప్రేమ్, శృతి అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతారు. అంతలో రాములమ్మ ఇంటికి వెళ్తూ అమ్మవారికి దండం పెట్టుకోడానికి వస్తుంది. ప్రేమ్, శృతి లను చూసి వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన దేవత నువ్వు అని వాళ్ళ ఇంటికి వెళ్తారు.

 

ఎప్పుడు తిన్నారో ఏమో ఒక ముద్ద అన్నం తినండమ్మ అని ప్రేమ్, శృతి లకు భోజనం వడ్డిస్తుంది రాములమ్మ. ఇది కూడా మా ఇల్లు లాగానే ఉంది. నువ్వు మా ఇంట్లోనే మాకు భోజనం పెడుతున్నట్లుగా ఉంది రాములమ్మ అంటూ.. ప్రేమ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. అమ్మ గురించి మీరు తప్పుగా అనుకోకండి ప్రేమ్ బాబు. మీరు లేకుండా తులసమ్మ అస్సలు ఒక్క క్షణం కూడా ఉండదు. అలాంటిది ఇంత పెద్ద త్యాగం చేసిందంటే కచ్చితంగా దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుంది అని రాములమ్మ అంటుంది. ప్రేమ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అమ్మ మనతోనే ఉంది శృతి.. అమ్మ ప్రేమ కి మనం ఎప్పటికీ దూరం కాలేను అని ప్రేమ్ అంటున్న మాటలు విని రాములమ్మ.. ఒక్క ముద్ద తినగానే తులసమ్మ చేతి వంట గుర్తుపట్టాడు ప్రేమ్ బాబు.. ఇదేనేమో కన్న తల్లి ప్రేమ అంటే.. ఇదేనేమో ఆ తల్లికి మీ మీదున్న ప్రేమ అని రాములమ్మ అంటుంది. ప్రేమ్ బాబు త్వరగా భోజనం చేయండి. తులసమ్మ మీ కోసం చేసిన పిండివంటలు సిద్ధంగా ఉన్నాయి అని అంటుంది.

Intinti Gruhalakshmi: 8 march 2022 today episode highlights
Intinti Gruhalakshmi 8 march 2022 today episode highlights

తులసి ఇంట్లో ప్రేమ్ కోసం చేసిన పిండివంటలు చూస్తూ బాధపడుతుంది. ఇవన్నీ నీకోసమే ప్రేమగా చేశాను ప్రేమ్.. వీటిలో ఏ ఒక్కటి నీకు తినిపించకుండానే ఇంట్లో నుంచి నిన్ను బయటకు పంపించేసాను. ఈ అమ్మ ను క్షమించు ప్రేమ్.. తప్పుగా అనుకోవద్దు అని తులసి బాధపడుతూ ఉంటుంది. ప్రేమ్ జ్ఞాపకాలను , స్మృతులను గుర్తు తెచ్చుకొని తులసి లోలోపల మదనపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో దివ్య తులసితో ప్రేమ్ గురించి ఓ పెద్ద రద్దాంతమే చేయనుంది..

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju