Intinti Gruhalakshmi: అంకిత వంటింట్లోకి వస్తుంది.. అంకితం చూసినా తులసి.. నీకోసమే కాఫీ కలుపుతున్నాను.. నువ్వు వెళ్లి కూర్చో వస్తున్నాను అని అంటుంది తులసి.. నా బంగారు తల్లి ఎంత మంచిది అంటే చెడ్డది కావాలనుకున్నా కాదు అంటూ తులసి అంకితను మెచ్చుకుంటుంది..!!

నువ్వు హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నా.. ఇంట్లో పనులన్నీ చేస్తున్నావ్.. కుదరకపోయినా కష్టపడుతున్నావ్.. నిజం చెప్పాలంటే నేను చెడ్డదాన్ని అయ్యాను.. నా దృష్టిలో నేను చెడ్డ దాన్ని అయ్యాను.. నామీద నాకే కోపం వచ్చింది నేను ఉండి కూడా నా బంగారు తల్లిని ఇంత కష్టపెడుతున్నాను.. ఫ్యాక్టరీ పనులలో కాసేపు కష్టపడడం ఆగిపోతే జీతం తగ్గుతుంది కానీ నువ్వు చేసే ఉద్యోగం అలా కాదు నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది.. నీకు కూడా నా మీద కోపం పడే హక్కు ఉంది.. పరిచే హక్కు ఉంది.. నీ మనసులో ఉన్న మాటలను నాకు చెప్పే స్వేచ్ఛ నీకు ఉంది.. వంటింట్లో పనులు నేను చెయ్యను అని చెప్పు నీలో నువ్వు బాధపడకు.. నిన్ను అర్థం చేసుకునే ఆంటీ నీ కళ్ళెదురుగా ఉందమ్మా.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది.. గుర్తుపెట్టుకో ఇకమీదట నీకు ఎప్పుడు కోపం వచ్చినా వచ్చి వెంటనే నాతో దెబ్బలాడు.. గొడవపడు.. ఇంత జరిగినా నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు..తగ్గదు కూడా.. ఎందుకంటే బిడ్డలను అమ్మ ప్రేమిస్తుంది కాబట్టి గాని అంకితకు అర్థమయ్యేలా చాలా ప్రేమగా చెబుతుంది తులసి..
ఇక తులసి మాట్లాడిన మాటలు అంకిత తన రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో లాస్య వచ్చి లాస్య వచ్చి తులసి గురించి చెడుగా చెప్తుంది. ఇక లాస్య మాటలు విన్న అంకిత కోపం వచ్చి.. మీరు మాట్లాడిన ఏ పది నిమిషాలలో ఆంటీ గురించి ఒక్కమాట కూడా మంచిగా మాట్లాడ లేదు కానీ.. తులసి ఆంటీ నాతో మాట్లాడిన రెండు నిమిషాలలో కూడా మీ గురించి అన్ని మంచి మాటలు మాట్లాడారు. నాకు ఆంటీ మీద కోపం ఉంది. అలాగని ఎప్పటికీ దూరం చేసుకోను అని క్లారిటీ ఇస్తుంది అంకిత..

ఇక ప్రేమ్ కూడా అంకిత చేసిన పొరపాటును తనకు అర్థం అయ్యే విధంగా చెబుతాడు తప్పు చేసిందని తెలుసుకుంటుంది. ఇక తులసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర వంటలన్నీ సిద్ధం చేసి ఉంచి.. రోజ్ ఫ్లవర్ తో సారీ అని రాసి డైనింగ్ టేబుల్ ను అందంగా అలంకరించి ఉంచుతుంది. అది చూసిన తులసి ఆంటీ దగ్గరకు వెళ్లి అంకిత సారీ చెబుతోంది. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా నందు ఇంత మంచి కుటుంబం నీకు ఉంది ఇప్పటికైనా మారమని హితబోధ చేస్తాడు..
Read More: Devatha Serial: కమలకు శ్రీమంతం చేసేది తన అక్క రుక్మిణీ అని తెలిసి ఏం చేసిందంటే..!?
ఇక అంకిత తన ట్రాప్ లో నుంచి జారిపోయింది అని తెలుసుకున్న లాస్య.. కోపం వచ్చి తన రూమ్ లోకి వెళ్లి.. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ ను పగలగొడుతుంది.. కరెక్ట్ గా అదే సమయంలో భాగ్య వస్తుంది. తనకోసం తన టైమంతా వేస్ట్ చేసి తన అంకితను నా గ్రిప్ లో పెట్టుకోవాలని చూశాను కానీ.. నా ప్రయత్నం అంతా వేస్ట్ అయ్యింది అంటూ భాగ్య తో చెప్తుంది. అంకిత మిస్ అయితే ఏముంది.. నీ పెద్దకొడుకు అభి ఉన్నాడు కదా.. తనని నీ ట్రాప్ చెయ్యి.. నీ మాయలో పడేయ్యి.. అభి తులసిపై చాలా అసంతృప్తిగా ఉన్నడు. తను కరెక్ట్ గా నీ మాట వింటాడు. లాస్య అభి ను గ్రిప్ లో పెట్టుకోవడం కోసం ఇంట్లో జరిగే సిచువేషన్ తనకు అనుకూలంగా లాస్య ఎలా మార్చుకుంటుందో.. తరువాయి భాగంలో తెలుసుకుందాం.