Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి.. సండే స్పెషల్ స్టోరీ..!! వచ్చే వారం జరగనున్నది ఇదే..!!

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.. ఈ సీరియల్ కథను కొత్త కోణంలో చూపిస్తూ.. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా అలరించడానికి కొత్త కొత్త పాత్రలను పరిచయం చేస్తూ.. ఊహించని ట్విస్ట్ లతో సాగుతోంది ఈ సీరియల్.. మొత్తానికి ఈ ఇంట్లో జరిగే సన్నివేశాలు చూస్తుంటే.. ఈ తరం వారికి ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో తెలియజేస్తోంది.. ఇక తులసి ని చూస్తే మాత్రం తనకున్న ఓపిక, సహనం, ధైర్యాన్ని మెచ్చుకోకుండా వీక్షకులు ఉండలేరు.. ఈ వారం జరిగిన హైలెట్స్..!! వచ్చే వారం లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Intinti Gruhalakshmi: Next week Episode details
Intinti Gruhalakshmi: Next week Episode details

లాస్య నందుని ఎలాగైనా తల గుప్పిట్లో ఉంచుకోవడానికి.. తులసి ఆలోచనలు తన మైండ్ లోకి రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.. అలా తన చేతి వంటను దూరం చేస్తేనే తన నుంచి దూరం చేస్తాననే భ్రమలో ఉంటుంది.. అలా ఈ సీరియల్లో కి వారెవ్వా వసంత ఎంట్రీ ఇస్తుంది.. ఈ కొత్త పాత్ర అందరినీ మెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.. ఇక నందు మాత్రం మాజీ భర్త గా తులసిని మర్చిపోలేక.. లాస్య ను భార్యగా యాక్సెప్ట్ చేయలేక.. తను చేసే పనులకు ఇంట్లో వారికి సర్ది చెప్పుకోలేక గందరగోళం లో ఉంటాడు.. లాస్య ఏ మాత్రం తగ్గకుండా సంప్రదాయంగా నడుచుకోకుండా ఈ తరం యువతి లాగే ఉండాలని ఉంటుంది. లాస్య ప్రవర్తన, పద్ధతిపై అనసూయమ్మ వేసే కౌంటర్లు షరా మామూలే..

 

తులసి ఎప్పటిలాగే నందు ని సపోర్ట్ చేస్తూ.. లాస్య ను ఏదో విధంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది.. దొరికిందే చాన్స్ అనుకుని లాస్య తులసి ను తనకు నచ్చినట్టుగా తన మాట వినేటట్లు చేసుకునే ఈ విధంగా డైరెక్టర్లు సృష్టించే సన్నివేశాలు చూస్తుంటే ఇలా కూడా చెయ్యొచ్చా అనిపిస్తుంది.. ఎలాగంటే లాస్య దగ్గరికి వెళ్లిన తులసి చేత ఆయన కాదు మీ ఆయన అనిపించేలా సృష్టించే సన్నివేశాలు వచ్చేవారంలో హైలెట్.. ఇక నందు లాస్య వద్దు అన్న చెప్పిన కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లడానికి సిద్ధం అవుతాడు.. పులికి తోకల బతకడం కంటే పిల్లి కి తలలా బతకడం మర్యాదగా ఉంటుందని.. మరోసారి లాస్య కు షాక్ ఇస్తాడు.. నందు ఇంటర్వ్యూ వెళ్లిన ఆవేశం చూస్తుంటే ఈసారి ఉద్యోగం రావడం ఖాయం అనిపిస్తుంది.. నందు కి ఉద్యోగం వస్తే లాస్య కు నందుకు దాదాపు గొడవలు ఏమి ఉండకపోవచ్చు.. ఒక్క తులసి విషయంలో తప్ప.. అదే ఉద్యోగం రాకపోతే మాత్రం.. తనకి లాస్య ఓ రేంజ్ లో టార్చర్ చూపిస్తుంది.. ఇండైరెక్ట్ సెటైర్లు పంచులు పేలుస్తుంది..

Intinti Gruhalakshmi: Next week Episode details
Intinti Gruhalakshmi: Next week Episode details

ఇక కొత్తగా వచ్చిన వసంత ను అనసూయమ్మ రీ కౌంటర్ వేస్ట్ వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు నిన్న ప్రోమో చూస్తే ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక వసంత అనసూయమ్మ మధ్య జరిగే సన్నివేశాలు కడుపుబ్బ నవ్వుకోవచ్చు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తారు.. మొత్తానికి వచ్చేవారం వసంత తో నవ్వులు ఇస్తూ తులసి లాస్య మధ్య ఫైరింగ్ సన్నివేశాలతో లాస్య నందుల మధ్య జాబ్ విభేదాలతో ప్రేమ్ శృతి ల మధ్య ప్రేమతో.. అంకిత అభిల మధ్య డబ్బులకు సంబంధించిన అంశాలతో వచ్చేవారం ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంచనా.. చూద్దాం వచ్చేవారం ఏం జరగనుందో..


Share

Related posts

బిగ్ బాస్ 4 : అబద్ధం చెప్పి అడ్డంగా బుక్ అయిన నోయల్…? జనాలు ఏమీ పిచ్చోళ్ళు కాదుగా

arun kanna

జగన్ క్యాబినెట్ పై పెద్ద అవినీతి మరక..! మంత్రి కుమారుడుపై తీవ్ర ఆరోపణలు..!!

Special Bureau

BJP : బీజేపీని ఇరుకున పెడుతున్న ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ …తెలంగాణాలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ !

Yandamuri