ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి హెల్త్ విషయంలో మిరాకిల్స్.. నందుకి క్లాస్ పీకిన లాస్య..! ప్రేమ్ కి అవమానం..!

Share

Intinti Gruhalakshmi: నందు తన ఫ్రెండ్ దగ్గర అ తులసి పరుగుతీసింది అన్న విషయం గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు.. ఎప్పుడు వచ్చావు నందు చడీ చప్పుడు లేకుండా అని లాస్య అంటుంది.. నందు చిరాగ్గా ఇప్పుడే వచ్చాను అని అంటాడు.. అంతలో నందు తులసి కి ఎందుకు అంత పొగరు అని అంటాడు.. అసలు ఏమైంది అని లాస్య అడగగా.. ఆఫీస్ లో జరిగింది మొత్తం లాస్య కు చెబుతాడు.. తులసి చంప పగులగొట్టాల్సింది అని అంటుంది.. ఎవరు నేనా అని అంటే.. కాదు తులీసినే నీ చంప పగులగొట్టాల్సింది అని అంటుంది.. అదేంటి అని నందు అంటాడు.. తను ఎన్నిసార్లు వద్దు వద్దు అంటున్నా ఎందుకు తన వెంట పడుతున్నావు.. ఇప్పటినుంచి నేను నీ భర్యనన్న విషయం గుర్తుంచుకో.. నీ ప్రేమ ఏదైనా ఉంటే అది నా మీద చూపించాలి.. ఇంకోసారి తులసి దగ్గరకు వెళ్లావు అని తెలిస్తే రియాక్షన్ వేరేలా ఉంటుంది అంటూ లాస్య ఫైర్ అవుతుంది..

Intinti Gruhalakshmi: Serial 13 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 13 May 2022 Today Episode Highlights

డాక్టర్ మా తులసి హెల్త్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని ప్రవళిక అడుగుతుంది.. ఏదో మిరాకిల్ జరుగుతుంది అని డాక్టర్ చెబుతుంది.. మీరు ఎక్స్ పెట్ చేయనంత ఇంప్రూమెంట్ మీలో కనిపిస్తుంది.. మందులు బాగా పని చేస్తున్న ఏమో డాక్టర్ అని తులసి అంటుంది.. లేదు అంతకు మించి ఏదో పని చేస్తుందని అది చెప్పగలను.. మందులు కొంతవరకే పనిచేస్తాయి.. మన ఆలోచనా విధానం మన పట్టుదల ఏ రోగన్నైనా అయినా జయిస్తాయి.. ఇవే మందులు కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండమని డాక్టర్ సలహా ఇస్తుంది తులసికి. థ్యాంక్యూ చెప్పి తులసి, ప్రవలిక అక్కడి నుంచి వచ్చేస్తారు..

 

డాక్టర్ చెప్పిన దాంట్లో నీకు ఏమి అర్థమైంది అని ప్రవళిక అడుగుతుంది.. నా డాక్టర్ నువ్వే అని నాకు అర్థం అయింది అని తులసి చెబుతుంది.. నీకు ఏం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో.. మొక్క నాటిన అప్పటి నుంచి ఎదుగుదల వరకు దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆ మొక్క ఎండిపోతుంది.. మన జీవితం కూడా అంతే.. తులసి మన మనసుకు ఎప్పుడు ఏం కావాలో అది అందించాలి.. మన మనసుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే.. ఆ మనసు మనల్ని అంతకన్నా జాగ్రత్తగా మనల్ని చూసుకుంటుంది అని ప్రవళిక చెబుతుంది.. ఇన్నాళ్ళు నా మనసుని పంజరం లో ఉంచాను దానికి స్వేచ్ఛ ఇవ్వలేదు.. నా కష్టాలన్నీ దానిమీద రుద్ది అలసిపోయేలా చేశాను.. నా తప్పు ఏంటో తెలిసేలా చేశావు ప్రవళిక.. నువ్వు సరిదిద్దుకో కలిగిన తప్పే చేశావు.. నీ మీద నాకు నమ్మకం పోయి భయం పెరిగింది.. ఇప్పటికీ కూడానా.. లేదు ఇప్పుడు మారే ప్రయత్నం చేస్తున్నాను అని తెలిసి సమాధానమిస్తుంది.. నాకు కావలసింది నీ గమ్యం ఆ గమ్యం చేరే దిశలో నువ్వు ఆస్వాదించాలి.. అప్పుడే నీ మనసుతో పాటు నువ్వు కూడా హెల్తీ గా మారుతావు.. అప్పుడు మీకు ఈ డాక్టర్స్ హాస్పిటల్స్ ఇవేమీ అవసరం ఉండదు.. నాకు ఒక కొత్త జీవితం ఇస్తున్నావు తృప్తిగా గడపటం ఏంటో నేర్పిస్తున్నావు .. ఆలోచనా విధానం మారితే మనం జీవించే విధానం తప్పకుండా మారుతుంది తులసి అని ప్రవళిక అంటుంది.. బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నావు.. పడే ఆ కష్టం నీకు ఇష్టమైన నీ మనసుకు నచ్చిన పని అయితే ఎంత బాగుంటుంది.. నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు.. నీకు పాటలంటే ఇష్టం పాడడం అంటే ఇష్టం దానిని ఎందుకు నీ ప్రొఫెషన్ గా మార్చుకోకూడదు అని ప్రవళిక అడుగుతుంది.. మీకు తెలిసిన విద్య ని వేరే వాళ్లకు నేర్పించు డబ్బు సంపాదించు అని ప్రవళిక అంటుంది అది అంత తేలిక కాదు ప్రవళిక నేను పాడటం వేరు.. వేరే వాళ్ళకి నేర్పించడం వేరు.. సాధన చేస్తే కానీ అది సాధ్యం కాదు.. చెయ్యి ఎవరు కాదన్నారు అంటుంది ప్రవళిక.. ఈ వయసులోనా అని తులసి అంటుంది.. సరే నాతో రా అని తులసి బయటకు తీసుకు వెళ్తుంది..

 

ప్రేమ్ చేస్తున్నా వంట సువాసనలు చూసి వాళ్ళ ఇంటి ఓనర్ వస్తాడు.. ఇక ప్రేమ్ తో కలిసి డ్యాన్స్ చేయడం వాళ్ళ ఆవిడ చూస్తుంది.. అంతలో వాళ్ళ ఆవిడ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. అద్దె అడగడానికి ఇంత దూరం రావాలా అని అంటాడు ప్రేమ్.. నువ్వు ఇవ్వకపోతే రావాలి కదా అంటాడు.. ఇంకొక్క రెండు రోజులు ఆగండి అని అంటాడు ప్రేమ్.. రాములమ్మ చెప్పింది కాబట్టి మీకు తక్కువకు ఇచ్చాం.. అదికూడా ఇవ్వకపోతే ఎలాగా.. మేము బ్రతికేది ఈ అద్దె డబ్బులతోనే.. ఈ సారి నుంచి టైమ్ ఇవ్వు ప్రేమ్ బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ ఇంటి ఓనర్..


Share

Related posts

Ram Charantej: టీనేజ్ కుర్రాడిగా కొత్త లుక్ లో రామ్ చరణ్ తేజ్..??

sekhar

Viral Video : అస్వస్థతకు గురైన పావురాయికి బుడతడి సాయం ఇదీ.. వైరల్ వీడియో

bharani jella

Bigg Boss Telugu 5: ఈవారం ఇంటి నుండి ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్న సభ్యులు..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar