Intinti Gruhalakshmi: తులసి యోగా చేస్తూ ఉండగా అదే పార్క్ కి వచ్చిన ఇద్దరు పిల్లలు సంగీతం సాధన చేస్తూ ఒకరి మీద ఒకరు తప్పులు ఎంచుకుంటారు.. వెంటనే తులసి అందుకని సంగీతం సాధన ఎలా చేయాలో చేసి చూపిస్తుంది.. తులసి వాయిస్ విన్న వాళ్ళ అమ్మ మా పిల్లలకు సంగీతం నేర్పిస్తారా అని అడుగుతుంది.. మీరు అడిగినంత ఫీజ్ ఇస్తాను అని చెబుతోంది.. ఫీజ్ గురించి కాదు రేపు ఎప్పుడైనా నాకు జాబ్ వస్తే అప్పుడు ఏంటా పరిస్థితి అని ఆలోచిస్తున్నాను అని అంటుంది.. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం ఇప్పుడైతే పిల్లలకు నేర్పించండి అని అంటుంది.. ఇక తులసి కూడా సంగీతం నేర్పించడానికి ఒప్పుకుంటుంది..!
దివ్య కాలేజ్ లో అన్న మాటలు తలచుకుని నందు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లక్కీ పాట పాడుతూ అటుగా వెళ్తాడు.. నందు కళ్ళతో వాడిని రమ్మని సైగ చేసాడు.. లక్కీ కూడా ఏమాత్రం తగ్గకుండా నేను రానని సైగ చేస్తాడు.. డబ్బుని లక్కీ దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. నన్ను నాన్న అని పిలువు అని అంటాడు నేను పిలవను అని చెబుతాడు లక్కీ.. ఎందుకు అంటే నువ్వు తులసి ఆంటీ ని వదిలేసి వచ్చి మా అమ్మతో ఉంటున్నావు. నువ్వు ఇక్కడ ఉంటున్నప్పటి నుంచి మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకోవడమే మర్చిపోయింది. నిన్ను ఎప్పటికీ నాన్న అని పిలవను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ..
తులసి సంగీతం నేర్పించడానికి వెళుతుంది. అదే ఇంటికి లాస్య తన ఫ్రెండ్ ను పలకరించడానికి లాస్య వెళ్లగా.. సంగీతం టీచర్ చేస్తున్న సాధన వింటూ లాస్య ఆ వాయిస్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది.. నాకైతే వెంటనే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోవాలని అనిపిస్తుంది.. పదా అంటూ నవ్వుతూ లాస్య ఆ సంగీతం దగ్గరికి వెళుతుంది..
తీరా చూస్తే ఆ సంగీతం టీచర్ ఎవరో కాదు తులసి.. ఇక్కడ జరిందంతా నందుకు చెబుతుంది లాస్య.. అప్పుడు నందు తన జాబ్ పోయిందని లాస్యతో చెబుతాడు.. లాస్య రియాక్షన్ ఏంటో తరువాయి భాగం లో చూడాలి..
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…