Intinti Gruhalakshmi: అంకిత తులసి ఇచ్చిన చీర కట్టుకుని వస్తుంది.. తులసి అంకిత దగ్గర వెళ్లి ఈ చీరలో నువ్వు ఎంత బాగున్నావో.. నడిచి వస్తున్నా మహాలక్ష్మి లాగా ఉన్నావు.. నిన్ను చూస్తుంటే ఆ దిష్టి తగిలేలాగా ఉంది. పార్టీ అయిన తర్వాత దిష్టి తీయించుకో అని అంటుంది.. నిజంగా ఈ చీరలో చాలా బాగుంది ఆంటీ.. అందరి కళ్ళు ఈ చీర మీదే ఉంటాయి అని అంటుంది అంకిత.. అంతలో లాస్య గాయత్రి దగ్గరికి వెళ్లి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.. నేను తెచ్చిన చీరె అంకిత కట్టుకోవాలి అని అంటుంది..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గాయత్రీ ఒక జ్యూస్ గ్లాస్ అంకిత దగ్గరకు తీసుకువెళ్లి జ్యూస్ తాగు అంకిత అంటూ తన జ్యూస్ ఒలకబోస్తుంది.. ఈసారి పాడైపోయింది కదా వెంటనే వెళ్లి లాస్య తీసుకొచ్చిన శారీ కట్టుకోమని చెబుతుంది గాయత్రి. దాంతో అంకిత డిసప్పాయింట్ నేను కేక్ కట్ చేయను అని అంటుంది. ఈ చీరే ఉంచుకో అంకిత పర్వాలేదు. ఈ చీర చాలా స్పెషల్. ఈ చీర మీద వాటర్ , జ్యూస్ ఏదైనా పడిన కూడా మరక కనిపించదు. కేవలం క్లాత్ పెట్టి తుడిస్తే చాలు మరక పోతుంది అంటూ తులసి తన చీర కొంగు పెట్టి ఆ మరకలను పోగొడుతుంది.. ఇప్పుడు ఎంచక్కా కేక్ కట్ చేయొచ్చు అని అంటుంది. పదా కేక్ కట్ చెద్దాం అని అంటుంది తులసి..
అంకిత కేక్ కటింగ్ చేశాకా గాయత్రి, వాళ్ళ డాడ్, అభి తరువాత తులసికి తినిపిస్తుంది.. ఇక వెంటనే గాయత్రి అదేంటి ముందు లాస్య ఆంటీకి తీనిపించకుండా తులసికి తినిపిస్తే ఎలాగా.. అని అంటుంది గాయత్రి. దాంతో పెద్ద రచ్చే జరుగుతుంది.. అంకిత కూడా నాకు నచ్చినట్టుగా ఉంటాను. నేను లాస్య ఆంటీ వాళ్ళ ఫంక్షన్ చేయమని అడిగాను ఒకవేళ నేను ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే అంతకు పది రెట్లు గ్రాండ్గా చేసుకునే దానిని అని అంటుంది నాకు తులసి అంటే అంటే ఇష్టం అందుకే ముందుగా తులసి ఆంటీకి తింపించను అని అంటుంది అంకిత.
లాస్య ఫంక్షన్ నుంచి పక్కకు వచ్చేసి బాధపడుతూ ఉంటుంది. అది చూసిన గాయత్రి బాధపడకు అని అంటుంది. నందు ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. పార్టీలో ఏమైనా జరిగితే బాధపడుతూనే అని.. కానీ బాధ లేకుండా ఎలా ఉంటుంది.. మేము ప్రేమకి బదులు ప్రేమే కదా కోరుకుంటున్నాము అని లాస్య అంటుంది. చూసావా అభి ఇదంతా మీ అమ్మ వళ్లే జరిగింది అని అంటుంది గాయత్రి. ఇదంతా ఓ పక్క నుంచి చూస్తున్న కలసి మా అమ్మ అలాంటిది కాదు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా అభి అని మనసులో అనుకుంటుంది.. ఇక ఈ మాటలు విన్న తులసి అంకిత దగ్గరకు వెళ్లి నీ పుట్టినరోజు సందర్భంగా నాకు ఒక బహుమతి ఇవ్వాలి అని అడుగుతుంది. నువ్వు జీవితంలో మా ఇంటి గడప తొక్కని మాట ఇవ్వు అని అంటుంది తులసి. దాంతో అంకిత వెక్కి వెక్కి ఏడుస్తుంది..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!