Intinti Gruhalakshmi: తులసి తన కోరిక మేరకు అంకిత అభిల చేత శ్రీరాముడు పూజ చేయిస్తుంది.. తులసి అభి వంక తదేకంగా చూస్తూ ఉండిపోతుంది.. దివ్య మామ్ నీ కొడుకును చూసుకుంది చాలు.. మాకు ప్రసాదం పెడతారా అని అంటుంది దివ్య.. అమ్మ అంకిత ఇంట్లో అందరికీ ప్రసాదం పెట్టు అని అని అంటుంది తులసి..! అంకిత ఇంట్లో అందరికీ ప్రసాదం పెడుతుంది..! తులసి మాత్రం వాకిట్లో నుంచుని ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరంధామయ్య వచ్చి అమ్మ తులసి అందరం ఇంట్లో ఉంటే నువ్వే ఏంటమ్మా బయటనుంచి ఉన్నావు అని అడుగుతాడు.. ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తానని చెప్పారు మావయ్య. తన కోసమే ఎదురుచూస్తున్నాను అని అంటుంది. అంతలో గాయత్రి తులసి దగ్గరకు వస్తుంది. రా వదినా అంటూ ఇంట్లోకి తీసుకెళ్తుంది గాయత్రిని.. అమ్మ అంకిత మీ అమ్మ వచ్చింది పలకరించు అని అంటుంది. మా అమ్మా ఎందుకు వచ్చిందో నాకు తెలిసి ఆంటీ.. మర్యాద అనేది తనకు తెలీదు. తనకు మర్యాద ఇవ్వడం దేనికి అని అంటుంది ఆంటీ అంటుంది అంకిత.. ఏంటి తులసి ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తున్నావా.. తులసి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉన్నావా లేదా అని అంటుంది. ఏమైంది ఆంటీ అని అభి అడుగుతాడు..
అంకిత అభిలను నాతోపాటు పంపించడానికి తులసి ఒప్పుకుంది. వాళ్ళిద్దరినీ నాతో పాటు మా ఇంటికి తీసుకు వెళ్ళడానికి నేను వచ్చాను అని అనగానే.. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. తలా ఒకరు తలా ఒక మాట అంటారు తులసిని.. అయినా తులసి మౌనంగా భరిస్తుంది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి మామ్ అని అభి అడుగుతాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నావా లేదా అని అభిని అడుగుతుంది తులసి.. లేదు మామ్ అంటాడు.. అలాంటప్పుడు మీ అత్తయ్య ఇచ్చిన ఇంటి తాళాలు నువ్వు ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతుంది. నేను ఇంకా నా నిర్ణయాన్ని చెప్పలేదు అంటాడు అభి. అంకిత ఇంత జరుగుతుంటే నువ్వేమి మాట్లాడవేంటి అని అభి అడుగుతాడు. నాకు కూడా అమ్మ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లడం ఇష్టమని అంకిత అంటుంది.. ఆ మాట విని అభి షాక్ అవుతాడు. ఏంటి అంకిత నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ల తాతయ్య అంటాడు. తులసి మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఇప్పుడు తను కష్టాల్లో ఉందని తెలుసుకుని మీ దారి మీరు చూసుకుంటున్నారని వాళ్ల తాతయ్య అంటాడు..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు తులసితో పర్సనల్ గా మాట్లాడుతుంది.. మీరు అభి నేను దూరమైన కూడా సంతోషంగా ఉండటం లేదని నాకు తెలిస్తే.. ఆ నిమిషమే మీ కాళ్ల దగ్గర నేను వాలిపోతాను.. మీరు సంతోషంగా ఉంటానని నాకు మాట ఇచ్చారు ఆంటీ అని అంటుంది అంకిత.. అంటే తులసి వాళ్ళిద్దరూ దూరమైన కూడా సంతోషంగా ఉంటానని అంకిత కు మాట ఇచ్చిందా.. అందుకే అంకిత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం..