Intinti Gruhalakshmi: “తులసి సంగీత పాటశాల” అని దివ్య బోర్డ్ ప్రిపేర్ చేస్తుంది.. తాతయ్య, నాన్నమ్మ, అమ్మ త్వరగా రండి నేను తెలుగు ఎంత చక్కగా రాసానో చూడండి అని బోర్డు చూపిస్తుంది.. పాటశాల కాదు పాఠశాల రావాలి అని చెబుతారు వాళ్ళ తాతయ్య.. అయినా 10 అక్షరాలలో 9 అక్షరాలు సరిగా రాసినందుకు నన్ను మెచ్చుకోక పోగా.. ఒక అక్షరం తప్పు రాశాను అని తీడతారా అని దివ్య అడుగుతుంది.. లేదమ్మా దివ్య నేను పాటలు నేర్పిస్తాను కాబట్టి.. నువ్వు పాటశాల అని రాశావు.. నువ్వు పర్ఫెక్ట్ గా రాసవంటు మెచ్చుకుంటుంది తులసి.. అప్పుడే టీ లో ఈగ లా తులసి తులసి అని గింజుకుంటున్నా లాస్య గొంతు వినిపిస్తుంది..
తులసి తులసి అంటూ లాస్య నందు ఇంటికి వస్తారు.. శుభమా అని నా కోడలు సంగీతం పాఠశాల పెట్టుకుంటే అపశకునం లాగా నువ్వు వచ్చావు ఏంటి అని లాస్య ను అడుగుతుంది అనసూయమ్మ.. కొంపలు కూల్చే మనిషిని ఇంట్లో పెట్టుకుని నన్ను అంటారు ఏంటి అని లాస్య అంటుంది. వాళ్ళు ఎవరో ఇక్కడ అందరికీ బాగా తెలుసు అని దివ్య అంటుంది. కొందరు చూడటానికి అమాయకంగా కనపడుతూ చేసేవాణ్ని చేస్తూ ఉంటారు.. మీ అమ్మలగా అని తులసిని చూస్తూ ఉంటుంది లాస్య.. మీ ఆవిడకి నిద్రపట్టకపోతే 2 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పండి. హాయిగా నిద్ర పడుతుంది. అంతే కానీ ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకోకండి అని అనసూయమ్మ అంటుంది. తనకున్న వంకర బుద్ధితో నా కొంపలో నిప్పులు పోసింది అని లాస్య అంటుంది. అందుకే నిలదీయడానికి వచ్చాము అని అంటుంది లాస్య..
నీ కొంపలో వేరే వాళ్ళు ఎవరు నిప్పులు పోయడానికి వేరే వాళ్ల అవసరం లేదు. నువ్వు చాలు లాస్య అంటుంది తులసి.. అసలు గొడవ పడకుండా ఏం జరిగిందో చెప్పు అని తులసి అడుగుతుంది.. నందు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు.. అందుకు సంజనా హెల్ప్ చేస్తాను అంది.. సంజనా కి మా మీద లేనిపోనివి చెప్పి.. మా బిజినెస్ లో మనీ ఇన్వెస్ట్ చేయకుండా చేసావు అని అంటుంది లాస్య. తులసి ఎప్పుడూ అలాంటి తప్పుడు పని చేయదు.. నేను అలాంటిది ఏమీ చెప్పలేదు మర్యాదగా మీరు ఎక్కడి నుంచి వెళ్తే మంచిది అని అంటుంది.
అంకిత వాళ్ళ నాన్న 50 కోట్ల ఆస్తి కి అంకితకు ఇవ్వాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న లాస్య అభి ని మచ్చిక చేసుకోమని నందుకు చెబుతుంది. అభి ఇప్పుడు ఒక బంగారు బాతూ.. తనని మనం మచ్చిక చేసుకుంటే మన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయిస్తాడు అని లాస్య సలహా ఇస్తుంది. నందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు రేపటి ఎపిసోడ్ చూసుకుందాం.
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…
Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…