Intinti Gruhalakshmi: తెలుగు సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ కు మరే సీరియల్ సాటి రాదు.. కానీ కార్తీకదీపం సీరియల్ కి గట్టిపోటీని ఇస్తూ సై అంటే సై అనే విధంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పోటీ పడుతుంది.. ఈ వారం వచ్చిన టిఆర్పి రేటింగ్స్ లో మొదటి స్థానంలో కార్తీకదీపం నిలవగా.. గట్టిపోటీని ఇచ్చి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రెండవ స్థానం ను కైవసం చేసుకుంది.. ఈ సీరియల్ ఊహించని మలుపులతో ప్రేక్షకులను అలరిస్తోంది.. సరికొత్త కథనంతో తో ప్రేక్షకులను టీవీ లో నుంచి కదలనివ్వకుండా చేస్తుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆనందాలకు నిలయమైన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకీ ఈ ఇంటి నుంచి ఒక్కరిని దూరం చేస్తూ.. సీరియల్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.. ఈ సీరియల్ మొత్తానికి తులసి పాత్రనే ప్రాణం పోస్తుంది.. అటువంటి తులసి ఇంట్లో నుంచి మొదట ప్రేమ్ ను శృతిని ఇంట్లో నుంచి పంపించేస్తే.. ఇక రెండో వంతు వచ్చేసింది.. అభి, అంకిత లను ఎట్టకేలకు తులసి గాయత్రి తో పాటు పంపించింది. తులసి ఒక్కొక్కరిగా ఇంట్లో నుంచి ఎందుకు దూరం చేస్తుందో తెలియడం లేదు కానీ.. ఎవరు లేకుండా తులసి ఎలా బ్రతుకుతుందో.. అనే సింపతీని క్రియేట్ చేసి సీరియల్ పై హైప్ క్రియేట్ చేసింది తులసి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ రెండు కష్టాలు చాలవన్నట్టూ తులసి కి మరొక కొత్త సమస్య వచ్చి పడింది.. తులసి పనిచేస్తున్న ఫ్యాక్టరీ స్థలం గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ అని.. ఆ ఫ్యాక్టరీ కి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఉన్నట్లు గుర్తించి ఎక్సైజ్ అధికారులు తులసి ఫ్యాక్టరీకి వస్తారు. తులసి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన.. వాళ్ళు అనుకోకుండా తులసి ఫ్యాక్టరీని సీజ్ చేస్తారు. భాగ్య ద్వారా ఈ విషయం తెలుసుకున్న లాస్య ఆనందంలో మునిగితేలుతోంది.. ఇక తులసి ఈ గండం నుంచి ఎలా బయట పడుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.