Intinti Gruhalakshmi: నందు తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుండగా లక్కీ ఆటలు ఆడుతూ గొడవ చేస్తూ ఉంటాడు. నందు కి డిస్టబెన్స్ గా అనిపించడంతో లక్కీని లోపలికి వెళ్ళు అని అంటాడు. నువ్వు ఎవరు ఆ మాట చెప్పడానికి.. నేను లోపలికి వెళ్ళను అని అంటాడు. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళు అని అంటాడు లక్కీ. నందు కోపంగా లక్కీ లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఏడ్చుకుంటూ లక్కీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. లాస్య వచ్చి నందును అరుస్తుంది.
ఒక్కసారి బొమ్మలు కొన్ని ఇవ్వగానే పిల్లలు మన మాట వినరు. ఇంతకీ లక్కీ ని ఎందుకు అరిచావు అని అడుగుతుంది లాస్య. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే వాడు గొడవ చేస్తున్నాడు. పక్కకు వెళ్లి ఆడుకోమని చెప్పాను. ఇప్పటికే కంపెనీ లో ఎవరు ఇన్వెష్ట్ చేస్తారని నేను తల పట్టుకుంటే వాడు గొడవ ఒకటి నాకు. అయితే నేను చెప్పిన పని చేస్తావా అని అడుగుతుంది లాస్య. నా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే పని అయితే ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు నందు. అయితే నువ్వు వెంటనే అభిని మచ్చిక చేసుకో అని అంటుంది. నందు ఎందుకు అంటే తను అంకిత ద్వారా 500 కోట్లకు అధిపతి కానున్నాడు. తనని నువ్వు మచ్చిక చేసుకుంటే మన కంపెనీలో కచ్చితంగా ఇన్వెష్ట్ చేస్తాడు. మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని లాస్య సలహా ఇస్తుంది. నందు ఒకటి గుర్తుపెట్టుకో అభి ఒకప్పటి అభి కాదు. తనకి తులసి అంటే చాలా ఇష్టం. నువ్వు చాలా జాగ్రత్తగా అభిని హ్యాండిల్ చేయాలి అని లాస్య చెబుతుంది.
తులసి తన బైక్ పంచర్ అవటంతో రోడ్డు మీద నిలబడి ఉంటుంది అటుగా వెళ్తున్న ప్రేమ వాళ్ళ అమ్మను చూసి తన దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు. అంతలో ఆ బైక్ పంచర్ అయింది అని తెలుసుకుని నేను రిపేర్ చేయిస్తాను అని అంటాడు. ఇలా రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరి బైక్ రిపేర్ చేయించడమెనా నీ పని వేరే పనేం లేదా అని అంటుంది తులసి. నిజంగానే ఏ పని లేదు మేడం మీకు హెల్ప్ చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ లాగా కనిపిస్తున్నారు అని అనేసరికి తులసి కరిగిపోయి సరే అంటుంది.
ఆటో కోసం ఎదురు చూస్తున్నా తులసిని చూసిన అంకిత కార్ ఆపి తనతో పాటు వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతుంటే.. ఇప్పుడు కాదులే మా మరోసారి వస్తాను అని అంటుంది తులసి. నా కోసం కాకపోయినా మీ అబ్బాయి అభి కోసమైనా రండి. ఫోన్ చేస్తే తనతో మాట్లాడడానికి కుదరడం లేదు. కనీసం కళ్లతోనే అయినా చూసుకోవచ్చు అని అంటుంది. సరే అని అంకిత తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గాయత్రి వాళ్ళ ఆయన అభి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఏం తులసి అమెరికా నుంచి వచ్చిన మీ అన్నయ్య గారిని చూడడానికి వచ్చావా అని వెటకారంగా మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ అమ్మా తులసి అని గాయత్రీ వాళ్ళ ఆయన అడిగితే.. సంగీతం నేర్చుకుంటుంది. కనీసం టీ నీళ్లకు అయినా డబ్బులు కావాలి కదా అని అంటుంది. గాయత్రి ఇలా అభి ముందే వాళ్ళ అమ్మని అవమానిస్తూ మాట్లాడుతున్నా అభి మౌనంగా ఉండిపోతాడు. తులసి అంటే ఇష్టమైన అంకిత వాళ్ళ అమ్మ తో మరోసారి గొడవ పడుతుందో లేదో చూడాలి.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…