Intinti Gruhalakshmi: తులసి అభినీ చూడటం కోసం అంకిత తోపాటు కలిసి గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ గాయత్రి తులసిని ప్రతి విషయానికి అడ్డుపడి అవమానిస్తూ ఉంటుంది. తను ఏ సమాధానం చెప్పినా తనకు అనుకూలంగా మార్చుకుని వ్యతిరేక విధానంలో తనని నిందించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.. అంకిత మధ్యమధ్యలో గాయత్రీ మాటలకు చురకలు వేస్తూనే ఉంటుంది.. ఇక గాయత్రి మాట్లాడే మాటలకు తులసి ఎదురుతిరిగి సమాధానం చెబుతుందన్న భయంతో అభి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు..!
నాన్న అభి నువ్వు ఈ అమ్మా ఎదురుతిరిగి మాట్లాడితుందన్న భయంతో లేచి వచ్చేసావ్ అని నాకు అర్థం అయింది. నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగానే ఉన్నానని అభి తల ఊపుతాడు. కానీ అభి మనసులో ఏదో భయం సంకోచం ఉందని తులసి అర్థం చేసుకుంటుంది. నువ్వు ఒక గొప్ప స్థాయికి చేరుకుంటే చూడాలని ఈ అమ్మకు ఉంది అని ఆభిని దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతుంది. అభి అమ్మ ప్రేమకు కరిగిపోతున్నా కూడా చుట్టు గాయత్రి వాళ్ళు ఉండటంతో మౌనంగా ఉండిపోతాడు. తులసి వెళ్తున్నా అని చెప్పి వచ్చేస్తుంది.
తులసి ఇంటికి ఆలస్యంగా రావడంతో ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతారు. తులసి అభిని చూడటం కోసం గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్లాలని చెబుతుంది . ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వాడి కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది వాళ్ళ అత్తయ్య. నాకు చూడాలని అనిపించింది అందుకే వెళ్లాను. అభి నన్ను చూసిన వెంటనే అమ్మ ఎలా ఉన్నావ్ అని అడగటం తో పాటు నేను వచ్చే వరకు నా చేతిని వదిలి పెట్టలేదు. వాళ్ళందరూ నాకు చాలా బాగా మర్యాదలు చేశారు అని తులసి చెబుతుండగా.. తులసి ఆంటీ అబద్ధం చెబుతుంది అని అంటుంది అంకిత. మీకు చెప్పేవన్ని అబద్ధాలు అమ్మమ్మ అసలు అక్కడ జరిగింది వేరు అని అంటుంది అంకిత..
శృతి ఇంట్లో పనిచేస్తుండగా వాళ్ల అమ్మగారు సార్ ఈరోజు టిఫిన్ తినకుండా వెళ్ళాడు. నువ్వు ఆఫీస్ కి వెళ్లి క్యారేజ్ ఇవ్వమని చెబుతుంది. శృతి క్యారేజ్ తీసుకుని మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గరికి బయలుదేరుతుండగా.. ప్రేమ్ ఫోన్ చేస్తాడు. నాకు జాబ్ వచ్చింది శృతి కంగ్రాట్స్ అని చెప్పు అని అంటాడు. నేను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్ లోనే ఉన్నాను అని అంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ గ్యారేజ్ తీసుకుని వెళ్తే నేను వీళ్ళ ఇంట్లో పని చేస్తున్న సంగతి తెలిసిపోతుంది. నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శృతి. మిగతా విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…