Intinti Gruhalakshmi: తులసి జాగింగ్ చేస్తుండగా లాస్య పార్క్ కి వెళ్లి తులసి అని పిలుస్తుంది. ఏంటి తులసి నా నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడం ప్రాక్టీస్ చేస్తున్నావా అని వెటకారంగా మాట్లాడుతుంది.. నీ నుంచి తప్పించుకునెంత అవసరం నాకేంటి అన్నట్టుగా తులసి అంటుంది.. నీకు ముందుగానే ఒక విషయం చెప్పనా అని లాస్య అంటుంది.. ఇప్పుడు అభి నా ట్రాప్ లో చిక్కొనున్నాడు అని అంటుంది. అది ఎప్పటికీ జరగదు.. నీ భ్రమ అని అంటుంది తులసి. నా ట్రాప్ లో పడక పోవచ్చు కానీ నందు చెప్తే వింటాడు గా అని అంటుంది. నీకు ఇంకో బంపర్ ఆఫర్ చెప్పనా.. అంకిత ను కూడా నా వైపు చూస్తూ ఉండు అని అంటుంది లాస్య..
లాస్య అభికి పాయసం అంటే చాలా ఇష్టం. నువ్వు తండ్రిలా ఫీల్ అవ్వటం ఆపెయ్. పోన్లే చేసావు కదా అది చాలు అంటాడు నందు. అంతలో డాడ్ అంటూ అభి వస్తాడు.. చాలా రోజుల తరువాత చాలా ఆనందంగా ఉంది. అభికి ఇది ఇష్టం ఇది ఇష్టం అది చేశిపెట్టు ఇది చేసిపెట్టు అని అంటున్నాడు అని లాస్య చెబుతుంది. అభి నావల్ల కాదు ఇప్పుడు నాకు ఏం వద్దు అంటాడు. అదేంటి అభి అలా అంటావ్ కనీసం పాయసం అయినా తిను నేను ఫీల్ అవుతాను అంటాడు నందు. అప్పుడప్పుడు ఇలా వస్తు ఉండు అభి అంటుంది లాస్య. మీరిలా చేసి పెట్టాలి కంటి అప్పుడప్పుడు ఏంటి రోజు వస్తూనే ఉంటాను అని అవి అంటాడు నవ్వుతూ..
ఒక్కడివే వచ్చావు ఏంటిరా అంకిత ను కూడా తీసుకు రావాల్సింది అంటాడు నందు. మీ విషయం వస్తె అలా రివర్స్ ఉంటుంది. మిగతా విషయాల్లో చాలా మంచిది. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను గుండెల మీద పెట్టుకుని పెంచలేదా.. కంపనీ పెట్టే తెలివితేటలు ఉన్నా కూడా ఇంట్లో ఉండే బాధ్యతల వాళ్ళ ఆ కంపెనీ స్టార్ట్ చేసేవాడిని. డాడ్ మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఈ పెద్ద కొడుకు ఉన్నాడని గుర్తుంచుకోండి. మీరు అంకిత కు దగ్గర అయితే బాగుంటుంది. రేపు అంకితకి బర్త్ డే విషెస్ చెప్పండి చాలు అంటాడు. అలా అయితే మా ఖర్చులతో మేమే అంకిత బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తాము అంటుంది. సరే ఆంటీ మీ ఇష్టం ఆంటీ.. ఈ ఐడియా అయితే సూపర్.. సరే ఆంటీ నేను వెళ్తున్నాను అని అభి అంటాడు.
అభి వెళ్లగానే నందు అంకిత బర్త్ డే మనం చేయడం ఏంటి ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా.. వాళ్ళది పెద్ద రేంజ్ సర్కిల్ చాలా ఖర్చు అవుతుంది అని నందు అంటాడు. మన అవసరం కూడా పెద్దదే అందుకోసం కాస్త డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని లాస్య అంటుంది. లాస్య బర్త్ డే ఫంక్షన్ చేయాలి అనుకుంటుంది. ఆ బర్త్డే ఫంక్షన్ కి వచ్చిన తులసి లాస్య ప్లాన్ నందు తో చెప్పడం వింటుంది. ఇక తులసి అంకిత ను లాస్య ఉచ్చులో పడకుండా ఏం చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.