ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: నందునీ ఆ ఫోటోలతో టార్చర్ పెడుతున్న ఫ్రెండ్స్.. భార్యతో ఎలా ఉండాలో అమ్మను చూసి నేర్చుకున్న ప్రేమ్..! 

Share

Intinti Gruhalakshmi: తులసి ప్రవళిక తో కలిసే షాపింగ్ చేసి వస్తుంది.. దివ్య ఆ బట్టలు నాకోసమే తీసుకొచ్చావా మామ్ అని అడుగుతుంది.. కాదు నాకు ప్రవళిక ఆంటీ కొనిపెట్టింది అని అంటుంది తులసి.. ఈరోజు చాలా సంతోషంగా గడిపిన నీ తులసి సంబరపడుతూ చెబుతుంది.. ఇంతకీ ఫోటోలు దిగాలేదా మామ్ దివ్య అడుగుతుంది.. ఎందుకు దిగలా ఇదిగో ఫొటోస్ అని దివ్యకి చూపిస్తుంది తులసి..!

Intinti Gruhalakshmi: Serial 3 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 3 May 2022 Today Episode Highlights

ఈ ఫోటోలు చాలా బాగున్నాయి మామ్ మామ్ ఎంత ఎంజాయ్ చేస్తుందో మాకే కాదు అందరికీ తెలియాలి అని నా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను అని దివ్య పోస్ట్ చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్య కంట ఆ ఫోటోలు పడతాయి.. ఇక ఆ ఫోటోలను చూస్తూ నందు ముందు ఆహా.. ఓహో అంటుంది. నందు తన మాటలు పట్టి పట్టనట్టు ఉంటాడు.. మీ మాజీ భార్య వ్యవహారం చూడండి.. ఒకటి కాదు రెండు కాదు.. షాపింగులు, పానీపూరి, చిట్ చాట్, డాన్సులు అబ్బో వ్యవహారం మామూలుగా లేదుగా అంటూ లాస్య నందుని రెచ్చగొడుతుంది.. నువ్వేమో తులసి ఫ్యాక్టరీ పోయి బాధల్లో ఉందని తనమీద విపరీతమైన జాలి ని చూపించావు తను ఇప్పుడు ఏం చేస్తుంది చూడు అంటూ నందు పై శివలెత్తుంది లాస్య..

 

అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటాడు నందు.. మీ అమ్మానాన్నలు ఫోన్ చేసి తులసి అదుపులో ఉండమని చెప్పు అంటుంది వాళ్ళు ఎప్పుడు నా మాట వినరు కదా ఎప్పుడు వెళ్ళటానికి అని అంటాడు అంటే నీ మాట వినే దాన్ని నేను ఒక్కదాన్నే నా అంటుంది లాస్య.. అంతలో నందుకి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. ఏరా అమాయకంగా ఉండే తులసి ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయింది. చీర కట్టుకొని గృహలక్ష్మీ లా ఉండే తులసి ఈరోజున ఇంతలా మారిపోయిందేంటి అని అడుగుతాడు. నాకు తెలియదు తెలిస్తే నీకు చెబుతాను అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు నందు..

Intinti Gruhalakshmi: Serial 3 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 3 May 2022 Today Episode Highlights

శృతి కి జ్వరం రావడంతో ప్రేమ్ తనకు అన్నీ తానై సేవలు చేస్తాడు. ప్రేమ్ తనపై చూపించే ప్రేమని చూసి శృతి ఏడుస్తుంది. మా అమ్మను మా నాన్న చాలా దారుణంగా చూసేవాడు. మా అమ్మ ను ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ.. తనతో మాత్రం ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మాఅమ్మ మా ఎవ్వరికి తెలియకుండా బాధపడేది. మా అమ్మ కష్టాలను దగ్గరిగా చూసిన నేను మా నాన్నలా నేను ఎప్పుడూ ప్రవర్తించకూడదు అని నిర్ణయించుకున్నారు. నా భార్య ను అమ్మలా చూసుకోవాలి అని నిర్ణయించుకున్న.. మా అమ్మని దేవతలా చూసుకోవాలని అనుకున్నాను కానీ.. నా దురదృష్టం మా అమ్మే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేసిందని ప్రేమ్ అంటాడు.. అందుకే జీవితంలో ఎప్పటికీ క్షమించను అని అంటాడు ప్రేమ్.


Share

Related posts

Job Notification : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నోటిఫికేషన్..!!

bharani jella

వకీల్ సాబ్ సెట్లో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్.. ఇక మెగా ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ..!

GRK

బాలయ్య బిబి3, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక కామన్ పాయింట్ ఉంది..రెండు సినిమాలు అప్పుడే..?

GRK