Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. సరికొత్త కథనంతో ఊహించని మలుపులతో వీక్షకులను అలరిస్తోంది. నిన్నటితో ఈ సీరియల్ 644 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో.. ఇంటింటి గృహలక్ష్మి 10.24 రేటింగ్ ను సొంతం చేసుకొని రెండవ స్థానంలో నిలిచింది.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కార్తీకదీపం గట్టిపోటీని ఇస్తుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఈ సీరియల్ ఎటువైపు మలుపు తిప్పుతారో తెలుసుకుందాం..!
645 ఎపిసోడ్ హైలెట్స్..!
అంకితకు 500 కోట్ల ఆస్తి కి అధిపతి కానుందని లాస్య తెలుసుకుంటుంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని నందు పెట్టబోయే కంపెనీకి ఎలాగైనా.. వీళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలని అనుకుంటుంది లాస్య. ఇక అదే పథకాన్ని నందు కి చెబుతుంది లాస్య. అభి పై నువ్వు ప్రేమ చూపిస్తే అభి మనం చెప్పినట్టు వింటాడు. మన కంపెనీ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాడు అని చెబుతూ సలహా ఇస్తుంది. నందుకి అలాంటి ఆలోచనలు లేకపోయినా లాస్య తన మైండ్ ను పొల్యూట్ చూస్తుంది..
నందు మాటలు విన్న అభి అంకిత పుట్టినరోజు రేపు. మీరు రేపు ఇంటికి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమంటాడు. అంతలో లాస్య రేపు తన బర్తడే పార్టీ మేము చేస్తాము అని అంటుంది. ఇది మంచి ఐడియా ఆంటీ. మీరు ఆ పనిలో ఉండండి ఆంటీ అని అభి సలహా ఇస్తాడు. లాస్య ఇచ్చిన ఐడియా ప్రకారం అంకిత పుట్టిన రోజు వాళ్ళింట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మనం అంకిత పక్కనే ఉండాలి. ఎలాగైనా మన మాట వినే లాగా చేసుకోవాలి అని చెబుతోంది లాస్య నందు కి. ఈ మాటలు తులసి వింటుంది. ఇక తులసి లాస్య ప్లాన్ ను ఖచ్చితంగా తిప్పికొడుతుందీ. అది ఎలాగో తరువాయి భాగంలో తెలుసుకుందాం.