Intinti Gruhalakshmi: తులసి రాత్రి 12 గంటలకు అంకిత కి ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెబుతుంది. మీరు చెబుతారో లేదో అని భయపడుతున్నారు ఆంటీ అంటూ అంకిత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పెళ్లయినప్పటి నుంచి మీరే ముందుగా నాకు విష్ చేసే వాళ్ళు ఈసారి చెబుతారో చెప్పరాని భయపడ్డాను. కానీ మీరు మళ్ళీ ఫస్ట్ టైం విష్ చేశారు అని అంటుంది అంకిత. వెంటనే దివ్య హ్యాపీ బర్త్ డే వదిన అని చెబుతుంది. నువ్వు ఇక్కడే ఉండి ఉంటే కేక్ కట్ చేయించే దానిని అంటుంది. మీరు రేపు బర్త్ డే ఫంక్షన్ కి రావాలి ఆంటీ.. మీరు రాకపోతే నేను బర్త్ డే ఫంక్షన్ చేసుకోను అంటుంది అంకిత..!
అభి వచ్చి నా బర్త్డే బేబీకి స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ అంటూ ఒక నక్లేస్ తీసుకొస్తాడు. అభి నక్లేస్ అంకిత మెడలో వేయబోతుండగా అంకిత అడ్డుపడుతుంది. నీ డబ్బులతో తీసుకొచ్చావా అని అంటుంది అంకిత నీ మీద ఒట్టు అంకిత ఈ గిఫ్ట్ డబ్బులతోనే తీసుకు వచ్చాను అని అంటాడు. అభి ఆ నెక్లేస్ అంకిత మెడలో వేస్తాడు. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తావా రేపు ఫంక్షన్ కు రమ్మని అని అడుగుతుంది. మీ అమ్మకు ఇష్టం లేదు అని అంటాడు అభి. నువ్వు ఎప్పటికీ మారవు అని అంటుంది అంకిత. తులసి అంటికే చెప్పలేదు అంటే ఇంకా శృతి వాళ్లకు కూడా చెప్పి ఉండడు అని అంకిత కాల్ చేస్తుంది. మీరు నాతో మాట్లాడకుండా ఏమైనా చెప్పాలి అనుకుంటే సాయంత్రం ఫంక్షన్ కి వచ్చి చెప్పండి లేదంటే నేను మీతో ఎప్పటికీ మాట్లాడను అని అంటుంది అంకిత.
లాస్య నందు తో మనం ఫంక్షన్ అయ్యేవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. తన పక్కనే ఉండి తనని మనం గ్రాప్ చేసుకోవాలి. తన కోసమే ఈ శారీ తీసుకువచ్చాను ఎలా ఉంది చెప్పు అని నందు ని అడుగుతుంది. నందు లాస్య తో చాలా కాస్ట్లీ గా ఉన్నట్టు ఉంది అని అంటాడు. లాస్య ఆ చీరలో గిఫ్ట్ గా ఆంకితకు ఇస్తే గాయత్రి చాలా బాగుంది. ఫంక్షన్ కి ఇదే కట్టుకోమని చెబుతుంది.
అంకిత బర్త్ డే కోసం తులసి స్వయంగా డిజైనర్ శారీ ని సిద్ధం చేస్తుంది. ఇక ఆ చీరకు ఫాల్ వేసి బ్లౌజ్ కూడా కుడుతుంది. ఇంతకీ ఇది ఎవరికని వాళ్ళ మావయ్య అడిగితే అంకిత బర్త్ డే కి నేను ఇచ్చే గిఫ్ట్ అని అంటుంది తులసి అంకిత బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళాక తను డిజైన్ చేసిన శారీ ఇస్తుంది. అంకిత ఆ శారీ చాలా బాగుందని చెప్పి కేక్ కటింగ్ చేసేటప్పుడు కట్టుకుంటా అంటుంది. ఆ శారీ వైపు చూస్తు చీప్ శారీ అంటూ గాయత్రి తులసిని చులకన చేస్తుంది. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.