ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి సింగర్ గా ప్రేమ్ కి పోటీ ఇస్తుందా..!? నందుని చెడామడా వాయించిన తులసి..!

Share

Intinti Gruhalakshmi: తులసి జాగింగ్ డ్రెస్ వేసుకొని దాని పైన శాలువా కప్పుకుని వస్తుంది.. అది చూసిన ప్రవళిక తులసిని వింతగా చూస్తుంది.. హేయ్ ఏంటి అలా చూస్తున్నావ్ అని తులసి అంటుంది.. జ్వరం వచ్చిందా అని ప్రవళిక అడుగుతుంది. కాదు అని అంటుంది తులసి.. మరి ఎవరో సన్మానం చేసి కప్పినట్టు ఈ శాలువా ఏంటి అని అడుగుతుంది ప్రవళిక.. నా జాగింగ్ డ్రెస్ ఎవరికీ కనిపించకుండా చుట్టూ కప్పుకున్నానని అమాయకంగా చెబుతుంది తులసి. శాలువా తీసి ఒక నిమిషం నిల్చో ఎవరైనా నిన్ను చూసి నవ్వినా ఏమైనా అన్నా రేపటి ఈ డ్రెస్ తోపాటు జాగింగ్ కి కూడా రానావసరం లేదు అంటుంది.. ఇక తులసి నీ ఎవ్వరూ చూడకుండా వెళ్లిపోతారు.. వాళ్లకు అంత సమయం లేదు అని ప్రవళిక అంటుంది.. ఇక ఇద్దరు కలిసి జాగింగ్ కి వెళ్తారు..!

Intinti Gruhalakshmi: Serial 4 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 4 May 2022 Today Episode Highlights

మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. వాళ్లకు మనల్ని పట్టించుకునే సమయం లేదు అంటుంది. సరే రేపటి నుంచి జాగింగ్ డ్రెస్ వేసుకొని వస్తాను అని అంటుంది తులసి. సరే రేపు కలుద్దాం అని ప్రవళిక తులసి వెళ్తారు. తులసి ఇంటికి వెళ్తుండగా నందు గట్టిగా తులసి అని పిలుస్తాడు. నేను వచ్చింది నీకోసమే వయసు మీద పడుతుండగా ఈ వెర్రి వేషాలు ఏంటి అని అడుగుతాడు నందు.. మీరెవరో తెలుసుకోవచ్చా అని తులసి అడుగుతుంది.. నా బట్టలు గురించి కామెంట్ చేయడానికి మీకున్న హక్కు ఏంటి.. ఈయన ఎవరు మీ ఆయన.. దేశోద్ధారకుడా లేక సంఘసంస్కర్త రోడ్డు మీద కనబడే ప్రతి ఆడదాని డ్రెస్సు గురించి ఇలాగే కామెంట్ చేస్తూ ఉంటారా అని లాస్య ను అంటుంది తులసి.. పెళ్ళావి అయ్యి ఉండి ఎలా చూస్తూ ఊరుకున్నావ్ అని తెలిసి అడుగుతుంది. నేనెవరో తెలియనంతగా కళ్ళు మూసుకుపోయాయి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్ తులసి అని నందు ఫైర్ అవుతాడు..

నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి తిరుగుతున్నావు ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా.. చూడబోతే నీకు దివ్యదృష్టి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది.. చెప్పకుండానే చాలా విషయాలు తెలిసి పోతున్నాయి.. నందు నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అది సూటిగా అడుగు.. ముసుగులో గుద్దులాట ఎందుకు అని లాస్య అంటుంది.. నీవల్ల నా పరువుపోతుంది అని అంటే.. నీ పక్కన ఉంది చూడు తను నీ భార్య.. నేను నీ మాజీ భార్య.. రోజు మీ ఆవిడ వేసుకునే బట్టలు కంటే ఈ రోజు నేను వేసుకున్న బట్టలు చాలా పద్ధతిగా మర్యాదగా ఉన్నాయి.. నీకు అవసరమైతే తనని కంట్రోల్లో పెట్టుకో నన్ను కాదు అని వార్నింగ్ ఇస్తూ తులసి ఎక్కడ నుంచి వెళ్లిపోతుంది..

Intinti Gruhalakshmi: Serial 4 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 4 May 2022 Today Episode Highlights

తులసి జాగింగ్ డ్రెస్ లో ఇంటికి రావడం చూసిన దివ్య అదిరేటి డ్రెస్ మీరేస్తే అంటూ పాట పాడుతుంది.. వెంటనే వాళ్ళ తాతయ్య, నానమ్మలను పిలుస్తుంది. అనసూయమ్మ తులసిని కోపంగా చూస్తూ నా బంగారు తల్లి భలే ముద్దుగా ఉన్నావు.. నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంటూ తులసిని మెచ్చుకుంటుంది.. మీలో వచ్చిన ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని పరంధామయ్య అంటాడు. ఈ మార్పుకి కారణం ప్రవళిక నే మావయ్య.. తను ఇచ్చిన ధైర్యంతోనే నేను మారగలుగుతున్నాను అని అంటుంది తులసి..

దివ్య కాలేజీకి వెళుతూ రేపు కాలేజీ ఫీజు కట్టాలి గుర్తుంచుకో మామ్ అని అంటుంది.. ఇక వాళ్ళ అత్తయ్య కూడా ఇంట్లో సరుకులు అయిపోయాయి అని చెప్తుంది.. ప్రవళిక దగ్గరికి వెళ్లిన తులసి మళ్లీ కష్టాల్లోకి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి అని అంటుంది ప్రవళిక. ఏం చేయాలి అని అంటుంది తులసి.. నువ్వు పాటలు బాగా పాడతావు.. ఒక్కసారి నీ గొంతు సవరించుకుని మళ్లీ ప్రయత్నించు అని సలహా ఇస్తుంది ప్రవళిక.. తులసి ప్రవళిక చెప్పినట్టే వింటుందా ఏం చేస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..


Share

Related posts

Rajamouli – Sukumar: ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేము చూడగలం..ఆర్ఆర్ఆర్‌పై సుకుమార్ రియాక్షన్..

GRK

మరో సినిమాను పట్టాలెక్కించిన న్యాచురల్ స్టార్

Teja

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఇద్దరూ ఆమెనే కన్నింగ్ క్యాండెట్ అంటున్నారు…!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar