ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: సై అంటే సై అంటున్న లాస్య, తులసి.. నందు నువ్వే ఇదంతా చేసావన్న లాస్య.. 

Share

Intinti Gruhalakshmi: తులసి తనతో మాట్లాడిన మాటలను తలుచుకుని నందు, లాస్య కోపంతో రగిలిపోతుంటారు. నిజం చెప్పు నందు నువ్వు నా డ్రెస్సులు గురించి నాతో చెప్పలేక.. తులసి చేత ఈ మాటలన్నీ అనిపించావు కదా అని అడుగుతుంది లాస్య.. నిన్ను ఏమైనా అనాలి అనుకుంటే నేరుగానే అంటాను.. ఎవరిని అడ్డం పెట్టుకొని అనాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు నందు. నేను వాకింగ్ కి రాను మొర్రో అంటే బలవంతంగా లేపి నన్ను తీసుకెళ్లి ఆ తులసి ముందు నిలబెట్టావు. తులసి అక్కడికి వాకింగ్ కి వస్తుందని నేను ఏమైనా కలగన్నానా అంటాడు నందు.. నువ్వు వస్తున్నావ్ అని తెలిసి అక్కడికి వచ్చిందేమో అని లాస్య అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. అసలు ఇన్ని రోజులు నా డ్రెస్ నా విషయంలో నువ్వు ఎప్పుడైనా ఇన్ వాల్వ్ అయ్యావా.. ఈ డ్రెస్ బాగుంది.. ఈ డ్రెస్ బాగోలేదు అని ఎప్పుడైనా కామెంట్ చేసావా అని లాస్య అడుగుతుంది. చేయలేదు అయితే ఇప్పుడు ఏంటి అని నందు అడుగుతాడు..

Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights

పెళ్ళాం అయినా బట్టల గురించి కామెంట్ చేయను నువ్వు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.. నేను తన విషయంలో ఎందుకు ఇవ్వాలి అవుతున్నాను నీకు అప్పుడే చెప్పాను కదా.. తను నా ముందు నిన్ను అన్ని మాటలు అంటున్నా నువ్వు ఏం మాట్లాడ లేకపోయాను నేను ఏం మాట్లాడలేకపోయాను అని అని మన ఇద్దరు పరువు పోయింది అని అంటుంది లాస్య. తులసిని గిచ్చి మనం ఏడ్చినట్లు ఉంది. దివ్య కి పెళ్లి జరిగే ఎంతవరకు తులసి గురించి నేను పట్టించుకుంటానే ఉంటాను అని నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights

అంకిత తులసి దగ్గరకు వచ్చి తన బాగోగులు అడిగి.. మీరు ఫ్యాక్టరీ కూడా వెళ్ళలేదు కదా ఆంటీ అంటూ తులసికి డబ్బులు ఇస్తుంది తులసి ఆ డబ్బులు తీసుకున్నట్లు తీసుకొని అంకిత బ్యాగ్ లో పెడుతుంది.. ఏంటి మళ్లీ ఇచ్చేశారు అన్నట్లుగా తులసి అంకిత చూస్తే.. మీ అంకుల్ తో చాలా సార్లు చాలా రకాల ఇబ్బందులు పడ్డాను. వాటితో పోలిస్తే ఇది పెద్దది కాదు. నాకు అవసరం అనిపిస్తే మళ్ళీ నేనే నీ దగ్గర తీసుకుంటాను అని అంటుంది. అంకిత ఇంటికి వెళ్లేసరికి అభి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోవడం చూస్తుంది. దాంతో పెద్ద గొడవ చేస్తుంది అంకిత. రోజురోజుకీ నా దృష్టిలో దిగజారిపోతున్నావ్ అభి అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 5 May 2022 Today Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మదర్స్ డే ఫంక్షన్ కి వెళ్తారు. అదే ఫంక్షన్ కి లాస్య నందు వస్తారు. వాళ్లతో పాటు లాస్య కొడుకు కూడా వస్తాడు. ఆ బుడ్డోడు తులసి ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి తనతో కబుర్లు చెప్తాడు. తులసి కూడా ఆ బాబుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని పలకరిస్తుంది.. అది చూసిన లాస్య తన కొడుకుని కొట్టబోగా తులసి అడ్డుపడుతుంది.. ఆ రచ్చ రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..


Share

Related posts

Samantha – Naga Chaithanya: సమంతపై కసి తీర్చుకుంటున్న నాగ చైతన్య..ఇలా దెబ్బకొట్టబోతున్నాడా..?

GRK

NTR 31: `ఎన్టీఆర్ 31`లో క‌మ‌ల్ హాస‌న్‌.. రోల్ ఏంటో తెలిస్తే షాకే?!

kavya N

బిగ్ బాస్ 4: మళ్లీ బాత్రూంలోకి మోనాల్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar