ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం ప్రత్యేకం.. తులసి ముందు నందుకు షాక్ ఇచ్చిన దివ్య..

Share

Intinti Gruhalakshmi: తెలుగు ధారావాహికలలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. కార్తీకదీపం సీరియల్ కు సమానంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ దూసుకెళ్తోంది.. ఊహించని ట్విస్ట్ లతో సరికొత్త మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను టీవీల నుంచి చూపు తిప్పుకొనివ్వడం లేదు..! ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..!

609 ఎపిసోడ్ హైలైట్స్..

దివ్య కాలేజ్ నుంచి పేరెంట్స్ మీటింగ్ అని నందుకు కాల్ రావడంతో ఆ మీటింగ్ కి అటెండ్ అవ్వాలని.. ఆ వంకతో తులసి దగ్గర లెవెల్ వేయాలని నందు చూస్తాడు.. కానీ తులసి ఆ పప్పులు ఉడకనివ్వదు.. కనీసం తులసి నందుకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదు. నందు తులసి వాళ్ళ ఇంటికి వచ్చి దివ్య కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. పేరెంట్స్ మీటింగ్ ఉందంట వెళదాం పద అని అంటాడు. అంతలో తులసి వచ్చి పేరెంట్స్ మీటింగ్ కి మీరు రానవసరం లేదు. నేను వెళ్తాను. ఇకనుంచి దివ్య బాధ్యత అంతా నాది. మీరేమీ పేరెంట్స్ మీటింగ్ కి రానవసరం లేదు‌. దివ్య గురించి ఆలోచించకండి అన్నట్టుగా చెబుతుంది. ఈ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు దివ్య. నువ్వు చెప్పమ్మా దివ్య మీటింగ్ కి రావాలా వద్దా అని వాళ్ళ నాన్న అడుగుతాడు.

Intinti Gruhalakshmi: Serial 609 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 609 Today Episode Highlights

దివ్య కూడా వాళ్ళ నాన్న ఇష్టమైన అప్పటికీ ఈ మీటింగ్ కి రావద్దు అని చెబుతోంది. ఇక నుంచి నా బాధ్యత అంతా అమ్మ చూసుకుంటుంది అని తేల్చి చెబుతోంది. నందు దివ్య మాటలు విన్న గణేష్ ఒక తల్లి అమ్మ దివ్య నువ్వేనా ఎలా మాట్లాడుతుంది అని అంటాడు అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను అని అంటుంది. దివ్య వాళ్ళ నాన్న అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. ఒక్కసారిగా దివ్య తన బాధ్యత తీసుకోవద్దు అని అనడంతో నందు కూడా షాక్ అవుతాడు. ఇక తులసి దారిలోకి దివ్య కూడా రావడంతో తెలిసి కూడా దివ్య ప్రవర్తన చూసి షాక్ అవుతుంది.

 

దివ్య బాధ్యత వద్దనిందనీ నందు ఇంటికి వెళ్లి చిందులు తొక్కుతాడు. లాస్య నందు కి ఇంకాస్త చిరాకు తెప్పిస్తుంది. నేను వద్దని చెప్తున్నాను కదా నువ్వు ఆ ఇంటికి వెళ్లొద్దు అని.. చూసావా వెళితే ఇప్పుడు ఏమైందో.. నిన్న మొన్నటి వరకు తులసి నిన్ను వద్దనుకుంటే.. ఆ తర్వాత మీ అమ్మనాన్నలు నిన్ను వద్దనుకున్నారు. ఇప్పుడు దివ్య కూడా వద్దు అనుకుంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం నిన్ను వద్దు అనుకుంటున్నారు .నువ్వే కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. తులసి దగ్గరకు వెళ్ళద్దు అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ.. లాస్య నందుకు క్లాస్ పికుతుంది. నందు రియాక్షన్ ఏమిటో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

పూజా హెగ్డే అప్పుడు సమంత ని కామెంట్ చేస్తే శాకుంతలం తో ఇప్పుడు దెబ్బకొట్టి కసి తీర్చుకుంది ..!

GRK

Jagan KCR: మోడీతో జగన్, కేసిఆర్ అప్పుడు ఊ.. అంటారా..? ఊహూ.. అంటారా..?

somaraju sharma

సీబీఐ ఎంట్రీతో బాబులో కొత్త గుబులు… ఆ పాయింట్ పట్టుకుంటే కష్టమే మరి!

CMR